తెలంగాణలో పసుపు బోర్డు పెట్టే ఆలోచన లేదు: కేంద్రం

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుపై రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని ఎంపీ సురేశ్ రెడ్డి అడిగిన ప్రశ్నకు వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాధానమిచ్చారు. నిజామాబాద్‌లో సుగంధద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం, రీజినల్ ఆఫీస్ కం ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డివిజన్ స్థాయి కార్యాలయాన్ని ప్రాంతీయ స్థాయికి పెంచినట్లు తోమర్ పేర్కొ్న్నారు. పసుపు, సుగుంధ ద్రవ్యాల ఎగుమతుల […]

Update: 2021-03-15 10:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుపై రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని ఎంపీ సురేశ్ రెడ్డి అడిగిన ప్రశ్నకు వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాధానమిచ్చారు. నిజామాబాద్‌లో సుగంధద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం, రీజినల్ ఆఫీస్ కం ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

డివిజన్ స్థాయి కార్యాలయాన్ని ప్రాంతీయ స్థాయికి పెంచినట్లు తోమర్ పేర్కొ్న్నారు. పసుపు, సుగుంధ ద్రవ్యాల ఎగుమతుల ప్రోత్సాహానికి కార్యాలయం ఏర్పాటు చేశామని, దిగుబడులపై రాష్ట్రంతో సమన్వయానికి కార్యాలయం ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో బోర్డు కార్యాలయాలు ఏర్పాటు చేశామన్నారు.

Tags:    

Similar News