PLI స్కీమ్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ : టెలికాం, నెట్‌వర్కింగ్ ఉత్పత్తుల కోసం రూ.12,195కోట్ల ప్రొడక్షన్ లింక్‌డ్ ఇనెసెంటివ్(పీఎల్‌ఐ) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరాలను వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా దేశీయ ఉత్పత్తులకు అనుకూల వాతావరణం సృష్టించామని, తయారీకి భారత్ ప్రపంచ కేంద్రంగా మారుతుందని తెలిపారు. పీఎల్‌ఐ పథకం వల్ల వచ్చే ఐదేండ్లలో దేశంలో టెలికాం పరికరాల ఉత్పత్తి రూ.2,44,200కోట్లు, ఎగుమతులు రూ.1,95,360కోట్లు, 40వేల […]
న్యూఢిల్లీ : టెలికాం, నెట్‌వర్కింగ్ ఉత్పత్తుల కోసం రూ.12,195కోట్ల ప్రొడక్షన్ లింక్‌డ్ ఇనెసెంటివ్(పీఎల్‌ఐ) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరాలను వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా దేశీయ ఉత్పత్తులకు అనుకూల వాతావరణం సృష్టించామని, తయారీకి భారత్ ప్రపంచ కేంద్రంగా మారుతుందని తెలిపారు.
పీఎల్‌ఐ పథకం వల్ల వచ్చే ఐదేండ్లలో దేశంలో టెలికాం పరికరాల ఉత్పత్తి రూ.2,44,200కోట్లు, ఎగుమతులు రూ.1,95,360కోట్లు, 40వేల ఉద్యోగాలు, పన్నుల ద్వారా రూ.17,000కోట్ల పన్ను ఆదాయం సమకూరుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుందని తెలిపారు. దేశంలో లాప్‌ట్యాప్, ట్యాబిలెట్ పీసీ ఉత్పత్తులను ప్రోత్సహించడం కోసం అతి త్వరలో మరో ప్రోత్సాహం తీసుకురావడానకి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.