సంతలో సడేమియా.. నిమిషాల్లో సెల్‌ఫోన్లు మాయం

దిశ, తుంగతుర్తి : నల్గొండ జిల్లా మండల కేంద్రమైన తుంగతుర్తిలో సోమవారం జరిగిన కూరగాయల సంతలో ముగ్గురు వ్యక్తులకు చెందిన విలువైన మొబైల్స్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. సంతలో ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలు, ఇతరత్రా వస్తువులను కొనుగోలు చేయడానికి వచ్చిన అన్నారం గ్రామానికి చెందిన ఈగ సత్తయ్యకు చెందిన రూ. 20 వేల విలువ చేసే సెల్‌ఫోన్ అపహరణకు గురైంది. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మరో ఇద్దరు కూడా ఇదే తరహాలో […]

Update: 2021-12-14 11:40 GMT

దిశ, తుంగతుర్తి : నల్గొండ జిల్లా మండల కేంద్రమైన తుంగతుర్తిలో సోమవారం జరిగిన కూరగాయల సంతలో ముగ్గురు వ్యక్తులకు చెందిన విలువైన మొబైల్స్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. సంతలో ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలు, ఇతరత్రా వస్తువులను కొనుగోలు చేయడానికి వచ్చిన అన్నారం గ్రామానికి చెందిన ఈగ సత్తయ్యకు చెందిన రూ. 20 వేల విలువ చేసే సెల్‌ఫోన్ అపహరణకు గురైంది. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మరో ఇద్దరు కూడా ఇదే తరహాలో సెల్‌ఫోన్లను పోగొట్టుకున్నారు.ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలాఉంటే ప్రతిసారీ సంతలో సెల్‌ఫోన్‌లతో పాటు పెద్ద ఎత్తున నగదును కూడా పలువురు వినియోగదారులు దొంగల అపహరిస్తున్నారు. పోలీసులకు సదరు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తూనే ఉన్నారు కానీ, ఇంతవరకు వారిని పట్టుకోవడం.. నిందితుల నుంచి వస్తువులను స్వాధీనం చేసుకోవడం లాంటివి చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్‌స్టేషన్ ఎదురుగానే జరిగే కూరగాయల సంతలో కస్టమర్లు ఈ విధంగా దొంగల బారిన చిక్కుకుని ఇబ్బందులు పడుతుంటే పోలీసులు ఏమీ చర్యలు తీసుకోకపొతే ఇక వారికి భయం ఎక్కడ ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News