16 జిల్లాల్లో ఇంటర్నెట్, SMS సేవలు బంద్

దిశ, వెబ్ డెస్క్: మొబైల్ ఇంటర్నెట్, SMS సేవలు నిలిచిపోయాయి. పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 16 జిల్లాల్లో ఈ సేవలు నిలిచిపోయాయి. అవి ఏ జిల్లాల్లో మీరు తెలుసుకోవాలంటే ఈ వార్త చూడాల్సిందే. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టుల కోసం ఈరోజు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తోంది. అక్కడ మొత్తం 16 జిల్లాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేసింది. […]

Update: 2021-09-26 00:05 GMT

దిశ, వెబ్ డెస్క్: మొబైల్ ఇంటర్నెట్, SMS సేవలు నిలిచిపోయాయి. పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 16 జిల్లాల్లో ఈ సేవలు నిలిచిపోయాయి. అవి ఏ జిల్లాల్లో మీరు తెలుసుకోవాలంటే ఈ వార్త చూడాల్సిందే.

ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టుల కోసం ఈరోజు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తోంది. అక్కడ మొత్తం 16 జిల్లాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలో మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేసింది. జైపూర్, ఉదయ్‌పూర్, భిల్వారా, అల్వార్, బికనీర్, దౌసా, చిత్తోర్‌గఢ్, బార్మర్, టోంక్, అజ్మీర్, నాగౌర్ తోపాటు మొత్తం 16 జిల్లాల్లో ఈ సేవలను నిలిపివేసింది. 12 గంటలపాటు ఈ నిబంధన అమలులో ఉంటుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. పరీక్షల్లో మోసాలను నిరోధించడానికే ఈ నిబంధనను అమలు చేస్తున్నామని తెలిపింది. అయితే, ప్రభుత్వం నిర్వహిస్తున్న 31 వేల పోస్టులకు దాదాపు 16 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని ప్రభుత్వం పేర్కొన్నది.

Tags:    

Similar News