అకౌంట్స్‌తో సెలెబ్రిటీల దందా
సెలెబ్రిటీలు అంటే పిచ్చి ఉంటుంది. హీరో, హీరోయిన్లంటే సాధారణంగానే ఒక క్రేజీనెస్ ఏర్పడుతుంది. ఇక ఫేవరెట్ స్టార్స్ అంటే మ్యాడ్‌నెస్ మామూలుగా ఉండదు. వాళ్ల గురించి ప్రతీ విషయం తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు ఫ్యాన్స్. పైగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సెలెబ్రిటీల గురించి తెలుసుకోవడానికి ఒక మంచి వారధి ఏర్పడింది. దీనివల్ల అటు స్టార్స్‌కు, ఇటు ఫ్యాన్స్‌కు ఇద్దరికీ లాభాలున్నాయి. స్టార్స్‌ను ఫాలో కావడం వల్ల మనకు నచ్చిన వ్యక్తి గురించి మంచి ఇన్‌ఫర్మేషన్ […]
సెలెబ్రిటీలు అంటే పిచ్చి ఉంటుంది. హీరో, హీరోయిన్లంటే సాధారణంగానే ఒక క్రేజీనెస్ ఏర్పడుతుంది. ఇక ఫేవరెట్ స్టార్స్ అంటే మ్యాడ్‌నెస్ మామూలుగా ఉండదు. వాళ్ల గురించి ప్రతీ విషయం తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు ఫ్యాన్స్. పైగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సెలెబ్రిటీల గురించి తెలుసుకోవడానికి ఒక మంచి వారధి ఏర్పడింది. దీనివల్ల అటు స్టార్స్‌కు, ఇటు ఫ్యాన్స్‌కు ఇద్దరికీ లాభాలున్నాయి. స్టార్స్‌ను ఫాలో కావడం వల్ల మనకు నచ్చిన వ్యక్తి గురించి మంచి ఇన్‌ఫర్మేషన్ దొరుకుతుండగా.. స్టార్స్‌కు ఫాలోవర్స్ పెరిగిపోయి.. పలు కంపెనీల నుంచి పెయిడ్ పార్టనర్‌షిప్ ఆఫర్స్ వస్తున్నాయి. తద్వారా వాళ్లు డబ్బులు సంపాదిస్తున్నారు.
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు ఇన్‌స్టాగ్రాంలో 50 మిలియన్ల ఫాలోవర్స్ రికార్డు దాటింది. దీంతో కంపెనీలు పెయిడ్ పార్టనర్‌షిప్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుంటూ ఒక్క యాడ్‌కు కోట్లల్లో డబ్బులు వసూల్ చేస్తోంది ప్రియాంక. దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, విరాట్ కోహ్లి, శ్రద్దాదాస్ లాంటి సెలెబ్రిటీలకు సైతం భారీ ఫాలోయింగ్ ఉంది. వీరు కూడా పెయిడ్ పార్టనర్‌షిప్స్‌తో మస్త్‌గా పైసలు సంపాదిస్తున్నారు. ఇక్కడ కంపెనీ ఆలోచించేది ఏంటంటే.. వీళ్లను ఫాలో అవుతున్న జనాల సంఖ్య, బ్రాండ్ అడ్వర్‌టైజ్మెంట్స్, సేల్స్. కానీ ఇదంతా ఫేక్ అని తెలిసింది . సెలెబ్రిటీలు పైసలు ఇచ్చి మరీ ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారని తెలుస్తోంది.
కొన్ని మీడియా సంస్థల దర్యాప్తుతో ఈ విషయాన్ని నిర్ధారించుకున్న ముంబై పోలీసులు ఫేక్ అకౌంట్స్ సృష్టిస్తున్న అభిషేక్ గౌడేనీ అరెస్ట్ చేశారు. తనను విచారించి మరిన్ని వివరాలు సేకరించనున్నారు. కాగా ఈ లిస్ట్‌లో ప్రియాంక, దీపిక కూడా ఉన్నట్లు సమాచారం.