IPLAuction2022‌ డేట్ ఫిక్స్.. నెట్టింట్లో మొదలైన వేలంపాట..!

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహా వేలానికి ముహూర్తం ఖరారు అయింది. దీంతో నెట్టింట్లో సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. వచ్చే ఏడాది అంతా సవ్యంగా (ఒమిక్రాన్, కొవిడ్ వ్యాప్తి అదుపులో) ఉంటే భారత్‌లోనే రిచ్ ప్రీమియర్‌ లీగ్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఇదివరకే బీసీసీఐ ప్రకటించింది. అయితే, ఐపీఎల్ 2022 సీజన్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆయా జట్లలో రిటైన్ ప్లేయర్ల విషయం మరింత ఆసక్తిని రేపింది. దీనికితోడు లక్నో, అహ్మదాబాద్‌ […]

Update: 2021-12-22 13:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహా వేలానికి ముహూర్తం ఖరారు అయింది. దీంతో నెట్టింట్లో సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి. వచ్చే ఏడాది అంతా సవ్యంగా (ఒమిక్రాన్, కొవిడ్ వ్యాప్తి అదుపులో) ఉంటే భారత్‌లోనే రిచ్ ప్రీమియర్‌ లీగ్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఇదివరకే బీసీసీఐ ప్రకటించింది. అయితే, ఐపీఎల్ 2022 సీజన్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆయా జట్లలో రిటైన్ ప్లేయర్ల విషయం మరింత ఆసక్తిని రేపింది. దీనికితోడు లక్నో, అహ్మదాబాద్‌ జట్ల రాకతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సమయంలో మెగా యాక్షన్ డేట్ ఖరారు కావడంతో ఎక్కడా తగ్గేది లేదంటూ ఫ్యాన్స్ మీమ్స్‌ వైరల్ చేస్తున్నారు.

ఫిబ్రవరిలోనే అసలు కథ..

ఇక వచ్చే ఐపీఎల్ రసపట్టును ఫిబ్రవరిలోనే ఫ్యాన్స్ ఆస్వాదించనున్నారు. ఈ మెగా టోర్నీలో కీలక ఘట్టం అయినా ఐపీఎల్ వేలం ఫిబ్రవరిలో రెండు రోజుల పాటు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు బీసీసీఐ అధికారి బుధవారం పీటీఐతో చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అది కూడా ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో.. బెంగళూరులోనే నిర్వహిస్తారని సదరు అధికారి చెప్పడం విశేషం. దీనికితోడు ఐపీఎల్ మ్యాచులు యూఏఈ వేదికగా నిర్వహిస్తారన్న వార్తలను ఆయన కొట్టిపారేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

నెట్టింట్లో మొదలైన సందడి..

ఐపీఎల్ మెగా యాక్షన్ వార్తలపై నెట్టింట్లో సందడి మొదలైంది. నెటిజన్లు తమ తమ అభిమాన జట్లకు ఆటగాళ్లను ప్రకటించేసుకుంటున్నారు. ముఖ్యంగా నూతనంగా యాడ్ అవుతోన్న లక్నో, అహ్మదాబాద్ జట్లకు ఇప్పటి నుంచే ఫ్యాన్స్ చేరుతున్నారు. అహ్మదాబాద్‌లో హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, వార్నర్‌లను సెలెక్ట్ చేసుకుంటున్నారు. అటు లక్నోలో కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్, ఇషాన్ కిషన్‌లను ముందుగానే ఎంపిక చేసుకుంటున్నారు. ఇంకొంత మంది అయితే టోటల్ జట్టులను సొంతంగా వేలంపాట వేస్తూ(కామెంట్ల రూపంలో) ప్రకటించుకుంటున్నారు. ఇంకా అహ్మదాబాద్ జట్టుకు బీసీసీఐ నుంచి క్లియరెన్స్ రాకపోయినా ఆ జట్టు పైన కూడా అభిమానాన్ని చాటుకుంటున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా ఐపీఎల్ సీజన్‌ 2022 ఇంకా సమయం ఉన్నప్పటికీ.. నెట్టింట్లో ముందుగానే #IPLAuction2022‌ను ట్రెండ్ చేయడం విశేషం.

 

Tags:    

Similar News