వీసా పేరిట మోసం… లక్షల్లో టోకరా !
దిశ, క్రైమ్‌బ్యూరో: వీసా పేరిట మోసం చేసిన వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంబర్‌పేటకు చెందిన కొత్తకాపు సంతోష్‌రెడ్డి యూఎస్ వెళ్లేందుకు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తుండగా ఏరోటుడాట్ కమ్ సంస్థకు చెందిన గిట్టా నరేందర్ పరిచయం అయ్యాడు. ఇదేక్రమంలో హెచ్1బీ వీసాకు సంబంధించిన పత్రాలు కావాలని చెప్పడంతో నరేందర్‌కు… సంతోష్‌రెడ్డి మెయిల్ చేశాడు. తర్వాత ప్రాసెస్ ఫీజు రూ.5.50లక్షలు కావాలని చెప్పడంతో నరేందర్‌కు చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్‌లో జమ చేశాడు. కానీ […]
దిశ, క్రైమ్‌బ్యూరో: వీసా పేరిట మోసం చేసిన వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంబర్‌పేటకు చెందిన కొత్తకాపు సంతోష్‌రెడ్డి యూఎస్ వెళ్లేందుకు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తుండగా ఏరోటుడాట్ కమ్ సంస్థకు చెందిన గిట్టా నరేందర్ పరిచయం అయ్యాడు. ఇదేక్రమంలో హెచ్1బీ వీసాకు సంబంధించిన పత్రాలు కావాలని చెప్పడంతో నరేందర్‌కు… సంతోష్‌రెడ్డి మెయిల్ చేశాడు. తర్వాత ప్రాసెస్ ఫీజు రూ.5.50లక్షలు కావాలని చెప్పడంతో నరేందర్‌కు చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్‌లో జమ చేశాడు. కానీ కొద్దిరోజులకు సంతోష్‌రెడ్డి ఫోన్ చేస్తే నరేందర్ నుంచి స్పందించకపోవడంతో మోసపోయినట్లు భావించి.. సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని శనివారం అరెస్ట్ చేశారు.