సుశాంత్ ప్రియురాలు రియాపై కేసు..
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు ఇప్పటికే అనేక మలుపులు తిరిగింది. తాజాగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబర్తిపై సీబీఐ కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే బీహార్ ప్రభుత్వం సుశాంత్ సింగ్ మరణంపై సీబీఐ ఎంక్వైరీకి చేయాలని ఆదేశించారు. మరోవైపు కేంద్రం కూడా సుశాంత్ కేసులో సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించామని సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు సుశాంత్ […]
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు ఇప్పటికే అనేక మలుపులు తిరిగింది. తాజాగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబర్తిపై సీబీఐ కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే బీహార్ ప్రభుత్వం సుశాంత్ సింగ్ మరణంపై సీబీఐ ఎంక్వైరీకి చేయాలని ఆదేశించారు. మరోవైపు కేంద్రం కూడా సుశాంత్ కేసులో సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించామని సుప్రీంకోర్టుకు తెలిపారు.
దీంతో సుప్రీంకోర్టు సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో ముంబై పోలీసులు ఆమెను పలుమార్లు విచారించారు. ఈ కేసులో రియా చక్రబర్తికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి రియా చక్రబర్తికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లావాదేవీలపై కన్నేసింది. రియాతో పాటు బాలీవుడ్‌లో ఉన్న ప్రముఖ నిర్మాతలు, దర్శకుల లావాదేవీలపై దర్యాప్తు మొదలుపెట్టారు. తాజాగా ఈ కేసులో సీబీఐ మరో కీలక అడుగు వేసింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై అనుమానాల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రబర్తిని ఏ1 ముద్దాయిగా ప్రకటించింది. మరోవైపు ఈ కేసులో ఏ2గా ఇంద్రజిత్ చక్రబర్తి, ఏ3గా సంధ్య చక్రబర్తి, ఏ4గా షోవిక్ చక్రబర్తి, ఏ5గా శామ్యూల్ మిరిండా, ఏ6గా శృతి మోడీతో పాటు పలువురును ఈ కేసులో ముద్దాయిలగా చేర్చింది. సీబీఐ రంగంలోకి దగడంతో సుశాంత్ సింగ్ మృతి వెనక ఉన్న అసలు రహస్యాలు త్వరలోనే వీడే అవకాశాలున్నాయి.