అనిల్ దేశ్‌ముఖ్ పీఏలను ప్రశ్నించిన సీబీఐ

ముంబై: బలవంతపు వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొని తన పదవికి రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ దగ్గర పనిచేసిన ఇద్దరు పీఏలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రశ్నించింది. ఆదివారం ముంబయిలోని సబర్బన్ సాంటాక్రూజ్‌లో గల డీఆర్‌డీవోలో.. అనిల్‌కు పీఏలుగా పనిచేసిన సంజీవ్ పలాండే, కుందన్‌లను విచారించింది. బార్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థల నుంచి ప్రతినెలా రూ. 100 కోట్లు వసూలు చేయాలని ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్‌ ఆరోపించగా.. […]

Update: 2021-04-11 06:39 GMT

ముంబై: బలవంతపు వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొని తన పదవికి రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ దగ్గర పనిచేసిన ఇద్దరు పీఏలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రశ్నించింది. ఆదివారం ముంబయిలోని సబర్బన్ సాంటాక్రూజ్‌లో గల డీఆర్‌డీవోలో.. అనిల్‌కు పీఏలుగా పనిచేసిన సంజీవ్ పలాండే, కుందన్‌లను విచారించింది. బార్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థల నుంచి ప్రతినెలా రూ. 100 కోట్లు వసూలు చేయాలని ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్‌ ఆరోపించగా.. దానిపై బాంబే హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం విదితమే. దీంతో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. కాగా ఆదివారం ముగిసిన దర్యాప్తులో సంజీవ్, కుందన్‌ల వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు.

సచిన్ వాజేకు సహకరించిన కాప్ అరెస్ట్

రిలయన్స్ అధినేత ముఖేష్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో నిలిపిఉంచిన కారు కేసులో తీగ లాగిన కొద్దీ డొంక కదులుతున్నది. సస్పెండైన ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు సచిన్ వాజేకు సహకరించాడనే ఆరోపణలతో పోలీస్ అధికారి రియాజ్ కాజీని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. రియాజ్‌ క్రైం ఇంటెలిజెన్స్‌ యూనిట్‌లో అసిస్టెంట్ పోలీస్ ఇన్స్‌స్పెక్టర్‌ (ఏపీఐ)గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో అరెస్టైన రెండో పోలీసు రియాజ్ కాజీ కావడం గమనార్హం.

Tags:    

Similar News