ముకుల్ రాయ్‌పై చార్జ్‌షీట్
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హత్యకేసుకు సంబంధించి సప్లిమెంటరీ చార్జ్‌షీటులో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ పేరును సీఐడీ అధికారులు చేర్చారు. గత ఏడాది ఫిబ్రవరిలో నదియ జిల్లాలో సరస్వతి పూజా కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్న కృష్ణగంజ్ ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్‌ను దుండగులు కాల్చి చంపారు. ఈ కేసులో తొలుత దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ముకుల్ రాయ్ పేరు చేర్చలేదు. గత సెప్టెంబర్‌లో సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో బీజేపీ ఎంపీ జగన్నాథ్ సర్కార్ పేరును చేర్చగా తాజాగా […]
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హత్యకేసుకు సంబంధించి సప్లిమెంటరీ చార్జ్‌షీటులో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ పేరును సీఐడీ అధికారులు చేర్చారు. గత ఏడాది ఫిబ్రవరిలో నదియ జిల్లాలో సరస్వతి పూజా కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్న కృష్ణగంజ్ ఎమ్మెల్యే సత్యజిత్ బిశ్వాస్‌ను దుండగులు కాల్చి చంపారు.
ఈ కేసులో తొలుత దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ముకుల్ రాయ్ పేరు చేర్చలేదు. గత సెప్టెంబర్‌లో సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో బీజేపీ ఎంపీ జగన్నాథ్ సర్కార్ పేరును చేర్చగా తాజాగా ముకుల్ రాయ్‌పై అభియోగాలు మోపారు. ఈ విషయమై ముకుల్ రాయ్ వివరణ కోరగా తనకు హింసాత్మక రాజకీయాలపై విశ్వాసం లేదని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడూ రాజకీయాల్లో హింసకు పాల్పడలేదని, ప్రస్తుతం కూడా అలాంటి చర్యలకు పాల్పడటం లేదని పేర్కొన్నారు.