వైఎస్ వివేకా హత్య కేసు : సీబీఐ అదుపులో మాజీ డ్రైవర్ దస్తగిరి ?
దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. 86వ రోజైన మంగళవారం సీబీఐ విచారణ చేపట్టింది. కడప సెంట్రల్ జైలు అతిథి గృహంలో అనుమానితులు, సాక్షులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అయితే మంగళవారం కూడా వైఎస్ వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు విచారించారు. సీబీఐ విచారణ ప్రారంభించినప్పటి నుంచి దస్తగిరిని సీబీఐ అధికారులు విచారిస్తూనే ఉన్నారు. అయితే మంగళవారం దస్తగిరిని విచారించిన సీబీఐ అధికారులు […]
దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. 86వ రోజైన మంగళవారం సీబీఐ విచారణ చేపట్టింది. కడప సెంట్రల్ జైలు అతిథి గృహంలో అనుమానితులు, సాక్షులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అయితే మంగళవారం కూడా వైఎస్ వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు విచారించారు. సీబీఐ విచారణ ప్రారంభించినప్పటి నుంచి దస్తగిరిని సీబీఐ అధికారులు విచారిస్తూనే ఉన్నారు. అయితే మంగళవారం దస్తగిరిని విచారించిన సీబీఐ అధికారులు కడప నుంచి ప్రొద్దుటూరుకు తీసుకెళ్లారు. సెక్షన్ 164 కింద మెజిస్ట్రేట్ ముందు దస్తగిరి వాంగ్మూలం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివేక హత్య కేసులో వాచ్‌మెన్ రంగన్న వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.