న్యాయం అడిగితే కుల బహిష్కరణ..!
దిశ, నిజామాబాద్ రూరల్: న్యాయం కావాలని అడిగితే కుల బహిష్కరణ చేశారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లాలోని గుండారం గ్రామానికి చెందిన రెడ్డి సునీత.. తన పట్టా భూమికి హద్దులు పాతించడంపై కుల పెద్దలను ఆశ్రయించారు. దేవాలయం భూమిని చూపించి దానిని తీసుకోమ్మని చెప్పారని బాధితురాలు ఆరోపించారు. తమకు దేవాలయ భూమి వద్దని.. తమ పట్టా భూమిలో ఉంటామని చెప్పడంతో పంచాయతీ తీర్మానం వ్యతిరేస్తావా అంటూ కుల బహిష్కరణ చేశారని […]
దిశ, నిజామాబాద్ రూరల్:
న్యాయం కావాలని అడిగితే కుల బహిష్కరణ చేశారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లాలోని గుండారం గ్రామానికి చెందిన రెడ్డి సునీత.. తన పట్టా భూమికి హద్దులు పాతించడంపై కుల పెద్దలను ఆశ్రయించారు. దేవాలయం భూమిని చూపించి దానిని తీసుకోమ్మని చెప్పారని బాధితురాలు ఆరోపించారు. తమకు దేవాలయ భూమి వద్దని.. తమ పట్టా భూమిలో ఉంటామని చెప్పడంతో పంచాయతీ తీర్మానం వ్యతిరేస్తావా అంటూ కుల బహిష్కరణ చేశారని వాపోయారు.
నిజామాబాద్లో కుల సంఘాల ఆధిపత్య పోరు పెరుగుతుందని బాధితురాలు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. బట్టలు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న తనతో ఎవరూ మాట్లాడడం లేదని వాపోయారు. ఇప్పటికైనా కుల బహిష్కరణ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.