కేసులు పెరుగుతున్నాయ్… జాగ్రత్త !

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని, మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఏర్పడిందని గాంధీ ఆసుపత్రి డాక్టర్లను ఉద్దేశించి వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా ఇప్పటివరకు ఎవ్వరూ చనిపోలేదని వ్యాఖ్యానించిన ఆయన పలు రకాల అనారోగ్య సమస్యలు వైరస్‌కు తోడయ్యాయన్నారు. ఇకపైన కరోనా మరణాలను తగ్గించాలని, పేషెంట్లు చనిపోకుండా అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని డాక్టర్లకు స్పష్టం చేశారు. నగరంలోని కోఠి కరోనా కమాండ్ కంట్రోల్ […]

Update: 2020-05-28 09:41 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని, మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఏర్పడిందని గాంధీ ఆసుపత్రి డాక్టర్లను ఉద్దేశించి వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. కరోనా కారణంగా ఇప్పటివరకు ఎవ్వరూ చనిపోలేదని వ్యాఖ్యానించిన ఆయన పలు రకాల అనారోగ్య సమస్యలు వైరస్‌కు తోడయ్యాయన్నారు. ఇకపైన కరోనా మరణాలను తగ్గించాలని, పేషెంట్లు చనిపోకుండా అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని డాక్టర్లకు స్పష్టం చేశారు. నగరంలోని కోఠి కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో గాంధీ వైద్య బృందం, మెడికల్ అడ్వైజరీ బోర్డుతో జరిగిన సమీక్ష సందర్భంగా మంత్రిపై వ్యాఖ్యలు చేశారు.

కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తున్న ఏకైక ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి మాత్రమేనని, ఇక్కడ మరణాలు తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాల్సిందిగా వైద్య సిబ్బందిని కోరారు. గరిష్ఠ స్థాయిలో 1500 మంది పేషంట్లకు చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తితే డాక్టర్లు, సిబ్బంది, డయాగ్నస్టిక్స్ సౌకర్యం, మందులు ఏ స్థాయిలో అవసరం అవుతాయో నివేదిక అందించాల్సిందిగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావును మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న పడకలను కూడా అవసరమైన పక్షంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్, హై డిపెండెంట్ యూనిట్, స్టెప్ డౌన్ యూనిట్‌గా విభజించి చికిత్స అందించడం కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇప్పటివరకు 1,321మందికి చికిత్స అందించి క్షేమంగా ఇంటికి పంపించడంలో వైద్యసిబ్బంది కృషిని మంత్రి అభినందించారు. డయాలసిస్ పేషెంట్లు, వృద్దులు, గర్భిణీ స్త్రీలకు చికిత్స అందించి పేషంట్ల మన్ననలు పొందడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Tags:    

Similar News