ప్రముఖ టాలీవుడ్ నిర్మాతపై కేసు నమోదు.. అక్రమంగా..

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్ పై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తన భూమిని అక్రమంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఫిల్మ్‌నగర్‌కు చెందిన గోపీకృష్ణ అనే వ్యక్తి సోమవారం బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అక్రమంగా తన భూమిలోకి ప్రవేశించి బెదిరిస్తున్నారని, సి కల్యాణ్‌ పేరుచెప్పి తనపై షారుప్‌, శ్రీకాంత్‌, తేజస్వీ అనే ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ […]

Update: 2021-06-28 23:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్ పై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. తన భూమిని అక్రమంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఫిల్మ్‌నగర్‌కు చెందిన గోపీకృష్ణ అనే వ్యక్తి సోమవారం బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అక్రమంగా తన భూమిలోకి ప్రవేశించి బెదిరిస్తున్నారని, సి కల్యాణ్‌ పేరుచెప్పి తనపై షారుప్‌, శ్రీకాంత్‌, తేజస్వీ అనే ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయమై సి. కళ్యాణ్ ఇంకా స్పందించకపోవడం గమనార్హం.

Tags:    

Similar News