కొకాకోలా కంపెనీపై కేసు
ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించిందనే ఆరోపణలపై కోకాకోలా కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో హిమాచల్ రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేశారు. ఇదే రాష్ట్రంలో ఉన్న కోకాకోలా కంపెనీ ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ యథావిధిగా కొనసాగించింది. తనిఖీలు నిర్వహించిన పోలీసులు లాక్ డౌన్ సమయంలో కంపెనీ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టిన సోలన్ జిల్లా ఎస్పీ రోహిత్ మాల్ పాని కంపెనీ పై ఐపీసీ 188 సెక్షన్ కింద కేసు నమోదు […]
ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరించిందనే ఆరోపణలపై కోకాకోలా కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో హిమాచల్ రాష్ట్రాన్ని లాక్ డౌన్ చేశారు. ఇదే రాష్ట్రంలో ఉన్న కోకాకోలా కంపెనీ ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తూ యథావిధిగా కొనసాగించింది. తనిఖీలు నిర్వహించిన పోలీసులు లాక్ డౌన్ సమయంలో కంపెనీ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టిన సోలన్ జిల్లా ఎస్పీ రోహిత్ మాల్ పాని కంపెనీ పై ఐపీసీ 188 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ సెక్షన్ కింద అరెస్ట్ అయిన వారికి ఆరు నెల జైలు శిక్షతో పాటు రూ. వేయి జరిమానా విధించనున్నట్టు తెలిపారు. కానీ కోకాకోలా కంపెనీ పై ఇప్పటికిప్పడే అధికారికంగా చర్యలు తీసుకోబోమని ఎస్పీ తెలిపారు.
Tags: case registered, coca cola company, solan district, no immediate action