డాక్టర్ సుధాకర్‌పై సీబీఐలో కేసు నమోదు
విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్‌పై పలు సెక్షన్ల కింద మంగళవారం సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ విషయం సీబీఐ తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి నడి రోడ్డు మీద ప్రజాప్రతినిధుల్ని దూషించడం.. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ మొబైల్‌ను కిందపడేయడం.. తనకున్న అధికారాలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేసి, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయనపై 188 సెక్షన్ కింద కేసు నమోదు అయ్యింది. 23మంది సాక్షుల సమాచారంతో […]
విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్‌పై పలు సెక్షన్ల కింద మంగళవారం సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ విషయం సీబీఐ తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి నడి రోడ్డు మీద ప్రజాప్రతినిధుల్ని దూషించడం.. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ మొబైల్‌ను కిందపడేయడం.. తనకున్న అధికారాలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేసి, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయనపై 188 సెక్షన్ కింద కేసు నమోదు అయ్యింది. 23మంది సాక్షుల సమాచారంతో పాటు 130 పేజీలతో కూడిన సీడీ ఫైల్‌ను ఫోర్త్ టౌన్ పోలీసులు సీబీఐకి అందజేశారు. సీబీఐ కేసు నమోదు చేయడంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని అన్ని వర్గాలలో చర్చ జరుతున్నది.