ముందు జాగ్రత్త.. కరోనా నివారణ
దిశ, మహబూబ్ నగర్: ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే కరోనా వ్యాధి సోకదని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కరోనా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా.. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని వీరన్నపేట ప్రాంతంలో పర్యటించారు. వైద్య ఆరోగ్య, ఐసిడిఎస్, మున్సిపాలిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా వైరస్ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేది […]
దిశ, మహబూబ్ నగర్: ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే కరోనా వ్యాధి సోకదని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కరోనా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా.. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని వీరన్నపేట ప్రాంతంలో పర్యటించారు. వైద్య ఆరోగ్య, ఐసిడిఎస్, మున్సిపాలిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా వైరస్ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేది కరోనా వ్యాధి లక్షణాలని తెలిపారు. అయితే ప్రజలు కరోనా వ్యాధి పట్ల భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. కరోనా వ్యాధి రాకుండా జిల్లా యంత్రాంగం అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందన్నారు. కరోనా వ్యాధి సోకకుండా ప్రజలు తరచూ సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు సూచించారు.
Tags: carona awarenes, collector, Venkatrao, mahabubnagar