కరోనా వ్యాప్తి పై అప్రమత్తత అవసరం : సీపీ

దిశప్ర‌తినిధి, ఖ‌మ్మం: కరోనా వ్యాప్తి నియంత్రణకు ముందు వరుసలో ఉండి పోరాడుతున్న పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యంపై జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని ఖ‌మ్మం పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. వైరస్ నివారణకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ నిబంధనల అమలుకు విశిష్ట కృషి చేస్తున్న పోలీస్ సిబ్బంది ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళనకు గురవకుండా మాస్కులు ధరించాల‌న్నారు. అలాగే శానిటైజర్లు వినియోగించడం ద్వారా వైరస్ వ్యాధి బారిన పడకుండా ఉంటారని సూచించారు.ప్రధానంగా రద్దీ ప్రదేశాల్లో ఎక్కువ వైరస్ వ్యాప్తి చెందే […]

Update: 2020-08-06 08:50 GMT
కరోనా వ్యాప్తి పై అప్రమత్తత అవసరం : సీపీ
  • whatsapp icon

దిశప్ర‌తినిధి, ఖ‌మ్మం: కరోనా వ్యాప్తి నియంత్రణకు ముందు వరుసలో ఉండి పోరాడుతున్న పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యంపై జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని ఖ‌మ్మం పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. వైరస్ నివారణకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ నిబంధనల అమలుకు విశిష్ట కృషి చేస్తున్న పోలీస్ సిబ్బంది ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళనకు గురవకుండా మాస్కులు ధరించాల‌న్నారు.

అలాగే శానిటైజర్లు వినియోగించడం ద్వారా వైరస్ వ్యాధి బారిన పడకుండా ఉంటారని సూచించారు.ప్రధానంగా రద్దీ ప్రదేశాల్లో ఎక్కువ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం వుంటుందని, కావున శుభకార్యాలకు, వేడుకలకు దూరంగా వుండాలని సిబ్బందికి సూచించారు.

Tags:    

Similar News