సశస్త్ర సీమాబల్‌లో 111 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు
న్యూఢిల్లీలోని హోం వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్‌బీ).. ఎస్ఐ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
దిశ, కెరీర్: న్యూఢిల్లీలోని హోం వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్‌బీ).. ఎస్ఐ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన వారు దేశ వ్యాప్తంగా ఎస్ఎస్‌బీ పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
సబ్ ఇన్‌స్పెక్టర్ (గ్రూప్ B నాన్ గెజిటెడ్) - 111 పోస్టులు
ఖాళీల వివరాలు:
ఎస్ఐ (పయనీర్) - 20
ఎస్ఐ (డ్రాఫ్ట్స్ మ్యాన్) - 3
ఎస్ఐ (కమ్యూనికేషన్) - 59
ఎస్ఐ (స్టాఫ్ నర్స్ -ఫిమేల్) - 29
అర్హత: పదోతరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
వయసు: ఎస్ఐ (పయనీర్, డ్రాఫ్ట్స్ మ్యాన్, కమ్యూనికేషన్) పోస్టులకు రూ. 18 నుంచి 30 ఏళ్లు.
ఎస్ఐ (స్టాఫ్ నర్స్‌లకు) 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ. 35,400 నుంచి రూ. 1,12,400 ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ .. ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 200 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరితేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.
వెబ్‌సైట్: http://www.ssbrectt.gov.in/