PGCIL Jobs: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. ఖాళీలు, అర్హత, జీతం వివరాలివే..!

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, గురుగ్రామ్(Gurugram)లోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL)లో ట్రైనీ సూపర్‌వైజర్(Trainee Supervisor) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.

Update: 2024-10-20 16:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, గురుగ్రామ్(Gurugram)లోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL)లో ట్రైనీ సూపర్‌వైజర్(Trainee Supervisor) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 70 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.powergrid.in ద్వారా ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 6 నవంబర్ 2024. నాగ్‌పూర్‌(Nagpur), భోపాల్‌(Bhopal), బెంగళూరు(Bangalore), చెన్నై(Chennai) నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

పోస్టు పేరు, ఖాళీలు:

ట్రైనీ సూపర్ వైజర్(Electrical) - 70 పోస్టులు

విద్యార్హత:

పోస్టును బట్టి డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 27 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

రాతపరీక్ష, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు :

అన్ రిజర్వ్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 300, ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

జీతం:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,000 సాలరీ ఉంటుంది.


Similar News