MGU Faculty Recruitment: మహాత్మా గాంధీ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..!
నల్గొండ(Nalgonda)లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ(MGU) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ(Nalgonda)లోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ(MGU) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పార్ట్ టైమ్(Part Time)/ గెస్ట్ ఫ్యాకల్టీ(Guest Faculty) పోస్టులను భర్తీ చేయనున్నారు. సైకాలజీ, ఎకనామిక్స్, ఇంగ్లీష్, హిస్టరీ తదితర సబ్జెక్టుల్లో పోస్టులు ఖాలీగా ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.mguniversity.ac.in/ ద్వారా ఆన్‌లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 28 డిసెంబర్ 2024.
పోస్టు పేరు, ఖాళీలు:
పార్ట్ టైమ్/ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు - 14
విద్యార్హత:
పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. నెట్/ సెట్ లేదా PHD ఉతీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను రిజిస్ట్రార్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఎల్లారెడ్డి గూడెం, నల్గొండ అడ్రస్ కు పంపించాలి.