అభ్యర్థులకు అలర్ట్ : రేపటి నుంచే JEE మెయిన్ 2024 సెషన్ 2 పరీక్షలు ..
JEE మెయిన్ 2024 సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 4న ప్రారంభమవుతుంది.
దిశ, ఫీచర్స్ : JEE మెయిన్ 2024 సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 4న ప్రారంభమవుతుంది. మొదటి రోజు, పేపర్ 1 BE/B.Tech పరీక్ష జరుగుతుంది. దీని కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామ్ సిటీ స్లిప్, అడ్మిట్ కార్డ్ జారీ చేశారు. దేశవ్యాప్తంగా నిర్దేశించిన కేంద్రాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. పరీక్ష అడ్మిట్ కార్డును ఇంకా డౌన్‌లోడ్ చేసుకోని అభ్యర్థులు. jeemain.nta.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 4 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 12 వరకు కొనసాగుతుంది. పేపర్ 2 పరీక్ష ఏప్రిల్ 12న జరుగుతుంది. సెషన్ 1 స్కోర్‌ను మెరుగుపరచాలనుకునే అభ్యర్థులను సెషన్ 2 పరీక్షలో హాజరు కావడానికి NTA అనుమతించింది.
పరీక్షా కేంద్రానికి ఇవి తీసుకెళ్లడం తప్పనిసరి..
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ తప్పనిసరిగా JEE మెయిన్ 2024 సెషన్ 2 హాల్ టికెట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఓటర్ ID కార్డ్ వంటి ఫోటో గుర్తింపు కార్డుతో పరీక్షా కేంద్రానికి వెళ్లవలసి ఉంటుంది. మీరు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లను కూడా తీసుకెళ్లాలి. ఈ పత్రాలు లేకుండా ఏ అభ్యర్థిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అభ్యర్థులు పారదర్శకమైన బాల్‌పాయింట్ పెన్ను, పారదర్శక వాటర్ బాటిల్‌ని తీసుకెళ్లవచ్చు.
ఇలా చేస్తే పరీక్ష రాయలేరు..
JEE మెయిన్ 2024 సెషన్ 2 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష హాల్‌లో పెన్సిల్ బాక్స్, హ్యాండ్‌బ్యాగ్, పర్సు, ఏదైనా పేపర్, స్టేషనరీ, స్టడీ మెటీరియల్, ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్లడానికి అనుమతి లేదని గుర్తుంచుకోవాలి. మొబైల్ ఫోన్, ఇయర్‌ఫోన్, మైక్రోఫోన్, పేజర్, కాలిక్యులేటర్, డాక్యుమెంట్ పెన్, స్లైడ్ రూల్, లాగ్ టేబుల్, కెమెరా, టేప్ రికార్డర్, కాలిక్యులేటర్ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లలేరు.
రెండు షిఫ్టుల్లో పరీక్ష
పేపర్ 1 పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. మొదటి షిప్టు పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రారంభమవుతుంది. రెండో షిప్టులో పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మొదటి షిప్టు పరీక్షకు అభ్యర్థులు ఉదయం 7.30 గంటలకు, సాయంత్రం షిఫ్టుకు మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. పరీక్షకు సంబంధించిన మరింత సమాచారం కోసం, అభ్యర్థులు NTA అధికారిక వెబ్‌సైట్‌లో జారీ చేసిన వివరణాత్మక మార్గదర్శకాలను తనిఖీ చేయవచ్చు.