ఇండో-టిబెటన్ బోర్డర్ లో... భారీ పోలీస్ కొలువులు!

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) లోని వివిధ విభాగాల్లో... హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రెండు ప్రకటనలు విడుదల చేసింది.

Update: 2024-08-29 12:52 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) లోని వివిధ విభాగాల్లో... హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రెండు ప్రకటనలు విడుదల చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు మహిళలూ దరఖాస్తు చేసుకోవచ్చు. సరిహద్దుల్లో పోలీస్ విధులు నిర్వర్తించాలనే ఆసక్తి ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 330

పురుషులు:

  • కానిస్టేబుల్ ( కార్పెంటర్) - 61
  • కానిస్టేబుల్ ( ప్లంబర్) - 44
  • కానిస్టేబుల్ (మేసన్) - 54
  • కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్) - 14
  • హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ) - 8
  • కానిస్టేబుల్ (యానిమల్ ట్రాన్స్ పోర్ట్) - 97
  • కానిస్టేబుల్ (కెన్నెల్ మ్యాన్) - 4 ఖాళీలు ఉన్నాయి.

మహిళలు:

  • కానిస్టేబుల్ (కార్పెంటర్) - 10
  • కానిస్టేబుల్ (ప్లంబర్) - 8
  • కానిస్టేబుల్ (మేసన్) - 10
  • కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్) - 1
  • కానిస్టేబుల్ (యానిమల్ ట్రాన్స్ పోర్ట్) - 18
  • హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ) - 1 ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: మెట్రిక్యులేషన్/ పదో తరగతితో పాటు ఏడాది వ్యవధి ఉన్న ఐటీఐ ( కార్పెంటర్/ ప్లంబర్/ మేసన్/ఎలక్ట్రీషియన్ ట్రేడ్) సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.

హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ) పోస్టుకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై.. ఏడాది వ్యవధి ఉన్న వెటర్నరీ కోర్సు/డిప్లొమా/సర్టిఫికెర్ట్ కోర్స్ పూర్తి చేయాలి.

కానిస్టేబుల్ (యానిమల్ ట్రాన్స్ పోర్ట్), కానిస్టేబుల్ (కెన్నల్ మ్యాన్) పోస్టులకు మాత్రం పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయసు: 10-09-2024 నాటికి 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. కానిస్టేబుల్ (యానిమల్ ట్రాన్స్ పోర్ట్) పోస్టుకు 18-25 ఏళ్లు; హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ), కానిస్టేబుల్(కెన్నల్ మ్యాన్) పోస్టుకు 18-27 ఏళ్ల వయసు ఉండాలి.

ఏజ్ రిలాగ్జేషన్: గరిష్టంగా ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, మాజీ సైనికోద్యోగులకు కేటగిరిని బట్టి మూడు నుంచి ఎనిమిదేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము: అన్ రిజర్వుడ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ లకు రూ. 100. ఎస్సీ/ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు లేదు.

ఎంపిక: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. మొదటి దశలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రెండో దశలో రాత పరీక్ష, మూడో దశలో ట్రేడ్ టెస్ట్, నాల్గో దశలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.

ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(పీఈటీ ): పురుషులు 1.6 కి.మీ పరుగును 7.5 నిమిషాల్లో పూర్తి చేయాలి. 11 అడుగుల లాంగ్ జంప్, 3.5 అడుగుల హై జంప్ లక్ష్యాన్ని చేరుకోవడానికి మూడు అవకాశాలు ఇస్తారు.

మహిళలకు 800 మీటర్ల పరుగును 4.45 నిమిషాల్లో పూర్తి చేయాలి. 9 అడుగుల లాంగ్ జంప్, 3 అడుగుల హై జంప్ లక్ష్య సాధనకు మూడు ఛాన్సులు ఉంటాయి. అర్హత సాధించిన వారికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. మాజీ సైనికోద్యోగులకు ఈ టెస్ట్ ఉండదు.

రాత పరీక్ష: ఆబిజెక్టివ్ తరహాలో/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ: 10-09-2024

వెబ్ సైట్: http://recruitment.itbpolice.nic.in


Similar News