బీఈఎంఎల్ లో... 100 కొలువులు
బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్) లో ఒప్పంద ప్రాతిపదికన 100 గ్రూప్-సి పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది.
దిశ, వెబ్ డెస్క్: బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(బీఈఎంఎల్) లో ఒప్పంద ప్రాతిపదికన 100 గ్రూప్-సి పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవాలి.
ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలిక్ట్రీషియన్, వెల్డర్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వయసు 32 ఏళ్లకు మించకూడదు. ఓబీసీలకు గరిష్ట వయసు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల మినహాయింపు ఉంటుంది.
పోస్టుల సంఖ్య, అర్హతలు:
- ఐటీఐ ట్రెయినీలు: 54
ఐటీఐలో 60 శాతం మార్కులతో పాసై.. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ ఉండాలి. అప్రెంటిస్ శిక్షణ పూర్తయిన తర్వాత మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
- ఆఫీస్ అసిస్టెంట్ ట్రెయినీలు - 46
డిగ్రీ/ కమర్షియల్ ప్రాక్టీస్ డిప్లొమా/కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సెక్రటేరియల్ ప్రాక్టీస్ డిప్లొమా ఉండాలి. ఆరు నెలల టైపింగ్ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం. గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తి చేసిన తర్వాత మూడేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ. 200. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ లకు ఫీజు లేదు.
ఎంపిక: రాత పరీక్ష/ ట్రేడ్ టెస్టులతో..
ఐటీఐ ట్రెయినీలకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష లేదా ట్రేడ్ టెస్ట్ తో ఉద్యోగంలోకి తీసుకుంటారు. రాత పరీక్షను మాత్రం బెంగళూరులోనే నిర్వహిస్తారు.