CWHC Recruitment: సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో 179 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్..!

ఢిల్లి(Delhi)లోని ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్(CWHC) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

Update: 2024-12-14 17:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లి(Delhi)లోని ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్(CWHC) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 179 మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://cewacor.nic.in/ ద్వారా ఆన్‌లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 12 జనవరి 2025.

పోస్టు పేరు, ఖాళీలు:

మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - 179

విద్యార్హత:

పోస్టును బట్టి డిగ్రీ, బీకాం, సీఏ, పీజీ, ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి:

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు మించి ఉండకూడదు.

ఎంపిక ప్రక్రియ:

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

జనరల్/ ఓబీసీ పురుష అభ్యర్థులకు రూ. 1350, SC, ST, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ. 500 ఫీజు ఉంటుంది.

జీతం:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 29,000 నుంచి రూ. 1,80,000 వరకు జీతం ఉంటుంది.


Similar News