కెప్టెన్సీతో పంత్‌కు లాభం

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 14వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఎంపికవడం వల్ల పంత్‌కు కెరీర్ పరంగా లాభం చేకూరుతుందని ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. ఇటీవల కాలంలో వరుస సిరీస్‌లలో మంచి ప్రదర్శన చేస్తున్న పంత్ ఈ పదవికి అర్హుడే అని పాంటింగ్ చెప్పాడు. ‘శ్రేయస్ అయ్యర్ జట్టులో లేకపోవడం బాధకరమే. అయితే పంత్ తనకు వచ్చిన అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాడని భావిస్తున్నాను. ఢిల్లీ జట్టుకు సారథ్యం వహించడానికి పంత్‌కు […]

Update: 2021-03-31 10:27 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 14వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఎంపికవడం వల్ల పంత్‌కు కెరీర్ పరంగా లాభం చేకూరుతుందని ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. ఇటీవల కాలంలో వరుస సిరీస్‌లలో మంచి ప్రదర్శన చేస్తున్న పంత్ ఈ పదవికి అర్హుడే అని పాంటింగ్ చెప్పాడు. ‘శ్రేయస్ అయ్యర్ జట్టులో లేకపోవడం బాధకరమే. అయితే పంత్ తనకు వచ్చిన అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాడని భావిస్తున్నాను.

ఢిల్లీ జట్టుకు సారథ్యం వహించడానికి పంత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి. కెప్టెన్ అవడం వల్ల అతడు మెరుగైన ఆటగాడిగా మారే అవకాశం ఉంటుంది’ అని రికీ పాంటింగ్ వెల్లడించాడు. పంత్ ఎంపిక పట్ల వీరేంద్ర సెహ్వాగ్ కూడా హర్షం వ్యక్తం చేశాడు. అతడిని చూస్తుంటే తన క్రికెట్ ప్రారంభ రోజులు గుర్తుకు వస్తున్నాయని వివరించాడు. పంత్ లాంటి సానుకూల దృక్పదం కలిగి ఉన్న క్రికెటర్ జట్టుకు నాయకుడు కావడం ఆటగాళ్లకు కూడా మంచిదని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News