కృష్ణుడి పేరిట వేలాది వృక్షాలను కూల్చొద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో యూపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. మధుర జిల్లాలోని కృష్ణుడి ఆలయానికి వెళ్లే దారిని విస్తరించడానికి 2,940 వృక్షాలను నరకడానికి అనుమతించాలని, అందుకు రూ. 138.41 కోట్ల పరిహారాన్ని, నరికేసిన చెట్ల సంఖ్యకు సమంగా కొత్త మొక్కలను నాటతామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. యూపీ అభ్యర్థనను సీజేఐ ఎస్ఏ బాబ్డే సారథ్యంలోని ధర్మాసనం తిరస్కరిస్తూ కృష్ణుడి పేరు మీద వేలాది వృక్షాలను నేలకూల్చరాదని, చెట్లు ప్రాణవాయువును అందిస్తాయని, వాటిని కేవలం ఒక సంఖ్యకు కుదించడం […]
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో యూపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. మధుర జిల్లాలోని కృష్ణుడి ఆలయానికి వెళ్లే దారిని విస్తరించడానికి 2,940 వృక్షాలను నరకడానికి అనుమతించాలని, అందుకు రూ. 138.41 కోట్ల పరిహారాన్ని, నరికేసిన చెట్ల సంఖ్యకు సమంగా కొత్త మొక్కలను నాటతామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. యూపీ అభ్యర్థనను సీజేఐ ఎస్ఏ బాబ్డే సారథ్యంలోని ధర్మాసనం తిరస్కరిస్తూ కృష్ణుడి పేరు మీద వేలాది వృక్షాలను నేలకూల్చరాదని, చెట్లు ప్రాణవాయువును అందిస్తాయని, వాటిని కేవలం ఒక సంఖ్యకు కుదించడం సరికాదని పేర్కొంది. మరోవిధంగా అంచనా వేయడానికి నాలుగు వారాల సమయాన్నిస్తూ సరైన రిపోర్టు అందించాలని ఆదేశించింది.