ఆలస్యమైందని అనుమతించలేదు
దిశ, తెలంగాణ బ్యూరో: సమయానికి రాలేదని సెక్యూరిటీ అనుమతించకపోవడంతో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో గ్రేడ్ 2 పరీక్ష కోసం వచ్చిన అభ్యర్థులు కంటనీరు పెట్టుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ ఆధ్వర్యంలో గురువారం జరుగుతున్న అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో గ్రేడ్ 2 అధికారి ఆఫీసర్ ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహిస్తున్నారు. మౌలాలి IDZ TCS iON డిజిటల్ జోన్ లో నిర్వహిస్తున్న పరీక్షలకు ఉదయం 8:30 గంటలకు గేట్లు మూసివేశారు. పరీక్ష సమయం 9 నుంచి […]
దిశ, తెలంగాణ బ్యూరో: సమయానికి రాలేదని సెక్యూరిటీ అనుమతించకపోవడంతో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో గ్రేడ్ 2 పరీక్ష కోసం వచ్చిన అభ్యర్థులు కంటనీరు పెట్టుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ ఆధ్వర్యంలో గురువారం జరుగుతున్న అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో గ్రేడ్ 2 అధికారి ఆఫీసర్ ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహిస్తున్నారు. మౌలాలి IDZ TCS iON డిజిటల్ జోన్ లో నిర్వహిస్తున్న పరీక్షలకు ఉదయం 8:30 గంటలకు గేట్లు మూసివేశారు. పరీక్ష సమయం 9 నుంచి 10 గంటల వరకు గంట పాటు ఉంది. ఉదయం 8:30 గంటలకు సెక్యూరిటీ గేట్లు మూసివేయడంతో అభ్యర్థులు సెక్యూరిటీ ఇతర అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు లోపలికి అనుమతించడానికి ససేమిరా అనడంతో సుమారు 30 మంది అభ్యర్థులు వెనుదిరిగారు.