కెనడావాసికి 27 మంది భార్యలు.. జగమంతా ఆయన కుటుంబమే!
దిశ, వెబ్‌డెస్క్: ప్రజెంట్ జనరేషన్‌లో ఉమ్మడి కుటుంబాలు కనిపించడం చాలా అరుదు. సినిమాల్లో తెరనిండుగా కనిపించే కుటుంబాలు చూసి సంతోషించడం, ఒకప్పటి ఉమ్మడి కుటుంబాల ప్రేమలు, ఆప్యాయతలు, సరదాల గురించి తెలుసుకుని మురిసిపోవడమే తప్ప, అలాంటి జీవనం కోరుకునేవాళ్లు కనిపించడం లేదు. అయితే కెనడాకు చెందిన ఓ ముగ్గురు బ్రదర్స్ తమ ‘పాలిగమి ఫ్యామిలీ’తో కలిసి మెలిసి ఉంటున్నారు. తమ కుటుంబంలో పుట్టినరోజు వేడుకలతో పాటు మేనకోడళ్లు, మేనల్లుళ్లు ఒకే పాఠశాలలో ఒకే తరగతిలో చదువు కుంటారని […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రజెంట్ జనరేషన్‌లో ఉమ్మడి కుటుంబాలు కనిపించడం చాలా అరుదు. సినిమాల్లో తెరనిండుగా కనిపించే కుటుంబాలు చూసి సంతోషించడం, ఒకప్పటి ఉమ్మడి కుటుంబాల ప్రేమలు, ఆప్యాయతలు, సరదాల గురించి తెలుసుకుని మురిసిపోవడమే తప్ప, అలాంటి జీవనం కోరుకునేవాళ్లు కనిపించడం లేదు. అయితే కెనడాకు చెందిన ఓ ముగ్గురు బ్రదర్స్ తమ ‘పాలిగమి ఫ్యామిలీ’తో కలిసి మెలిసి ఉంటున్నారు. తమ కుటుంబంలో పుట్టినరోజు వేడుకలతో పాటు మేనకోడళ్లు, మేనల్లుళ్లు ఒకే పాఠశాలలో ఒకే తరగతిలో చదువు కుంటారని చెబుతున్నారు. కాగా, ఆ ముగ్గురు సోదరుల తండ్రికి 27 మంది భార్యలు, 150 మంది పిల్లలు ఉండటం గమనార్హం.
కెనడాకు చెందిన 19 ఏళ్ల మెర్లిన్ బ్లాక్‌మోర్ తన 150 మంది సోదరులు, వారి పిల్లలతో కలిసి జీవించడం ఓ భిన్నమైన అనుభవమని తన బ్రదర్స్ ముర్రే, వారెన్‌తో కలిసి టిక్‌టాక్ లైవ్‌లో తన ఫాలోవర్స్‌కు వివరించాడు. తన తండ్రి విన్‌స్టన్ బ్లాక్‌మోర్‌కు 27మంది భార్యలు, 150 మంది పిల్లలు కాగా, ఇలా ఒకే కుటుంబంలో ఎక్కువమంది కలిసి జీవించడం ఓ కల్ట్ అవుతుందని మెర్లిన్ తెలిపాడు.
‘సిబ్లింగ్స్, కోడళ్లు, అల్లుళ్లతో కలిసి స్కూలుకు వెళుతుండటంతో మా అందరికీ క్లాస్‌మేట్స్, స్నేహితులు ఎక్కువగా లేరు. తన సిబ్లింగ్స్‌లలో పెద్దవాడి వయసు 44 ఏళ్లు. చిన్నోడికి వన్ ఇయర్. తమ బయోలాజికల్ మదర్‌ను ‘మామ్’ అని పిలిస్తే, స్టెప్ మదర్‌ను ‘మదర్’గా పిలుస్తాం. అలానే మాలో కొందరు ఒకే రోజున వేర్వేరు తల్లులకు పుట్టిన వాళ్లం ఉన్నాం. ఇక మా ఇంట్లో ఎవరి పుట్టినరోజున వచ్చిన అంతా కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాం. చాలా గ్రాండ్ పార్టీ ఉంటుంది ఆ రోజు. ఇక మేమంత వేర్వేరుగా ఉండకుండా అంతా కలిసి ‘మోటెల్ హౌజ్’లో ఉంటున్నాం. ఇంతమంది ఉన్నప్పుడు అందరికీ సరిపడా కూరగాయాలు కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అందుకే మేమే వెజ్‌టెబుల్స్ పండించుకుంటాం. కొన్ని కారణాల వల్ల పాలిగమి ఫ్యామిలీని వదిలి కొందరు ఇప్పుడిప్పుడే కుటుంబాల వారీగా ఉంటున్నారు. కానీ, ముందు తరాలు మాత్రం మళ్లీ కలిసి ఉండాలని కోరుకుంటున్నాం’ అని మెర్లిన్ ఆ వీడియోలో తన మనసులోని మాటలను చెప్పుకొచ్చారు. ఒక భర్త ఒక్కరి కంటే ఎక్కువమంది భార్యలను(మల్టిపుల్ వైవ్స్) కలిగి ఉంటే ‘పాలిగమి’ అని, ఒక భార్య ఒక్కరి కంటే ఎక్కువమంది భర్తలను కలిగి ఉంటే ‘పాలిగండ్రి ’ అని అంటారు. చాలా దేశాల్లో ఇది చట్టవిరుద్ధం.