భారత ప్రయాణికులకు ఊరట ఇచ్చిన కెనడా

ఒట్టోవా: భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాలపై నిషేధాన్ని జులై 21 వరకు పొడిగించింది. భారత్ నుంచి డైరెక్ట్‌గా కాకుండా వయా మరో దేశం నుంచి రావడానికి అంగీకరించింది. భారత్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ద్వారా వేరే దేశానికి చేరి అక్కడ కరోనా టెస్టు నెగెటివ్ రిపోర్టు తీసుకుని ప్రయాణించేవారికి కెనడాలోకి ప్రవేశముంటుందని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇండియాలో నిర్వహించే కొవిడ్-19 మాలిక్యూలర్ టెస్టు రిపోర్టును అంగీకరించట్లేదని వివరించింది. కరోనా పాజిటివ్ ఉండి కూడా కెనడా వెళ్లాలనుకునేవారు […]

Update: 2021-07-15 07:22 GMT

ఒట్టోవా: భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాలపై నిషేధాన్ని జులై 21 వరకు పొడిగించింది. భారత్ నుంచి డైరెక్ట్‌గా కాకుండా వయా మరో దేశం నుంచి రావడానికి అంగీకరించింది. భారత్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ద్వారా వేరే దేశానికి చేరి అక్కడ కరోనా టెస్టు నెగెటివ్ రిపోర్టు తీసుకుని ప్రయాణించేవారికి కెనడాలోకి ప్రవేశముంటుందని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇండియాలో నిర్వహించే కొవిడ్-19 మాలిక్యూలర్ టెస్టు రిపోర్టును అంగీకరించట్లేదని వివరించింది.

కరోనా పాజిటివ్ ఉండి కూడా కెనడా వెళ్లాలనుకునేవారు మూడో దేశంలో కనీసం 14 రోజులు ఉండాల్సి ఉంటుందని తెలిపింది. దీనికి సంబంధించిన ప్రూఫ్ సమర్పించి కెనడాలోకి రావాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, భారత ఈశాన్య రాష్ట్రాలు, జమ్ము కశ్మీర్‌లో అత్యవసరమైతే తప్పా ప్రయాణాలు విరమించుకోవాలని కెనడా పౌరులకు సూచించింది. సెకండ్ వేవ్ ప్రారంభమవుతుండగా ఏప్రిల్ 22 నుంచి భారత విమానాలపై కెనడా ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News