జీఎస్టీ తగ్గింపుతో పాటు పన్ను రిటర్నుల గడువు పెంచండి: పరిశ్రమల సంఘం!

దిశ, వెబ్‌డెస్క్: దుస్తులు, పాదరక్షలపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పెంపును వాయిదా వేయాలని, అలాగే ఆదాయ పన్ను రిటర్న్(ఐటీఆర్) గడువు పొడిగించాలని దేశీయ వ్యాపారుల సంఘం సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) దుస్తులు, పాదరక్షలపై నిర్ణయించిన 5 శాతం నుంచి 12 శాతం జీఎస్టీ పెంపు చాలా ఎక్కువని అభిప్రాయపడింది. దీనివల్ల కరోనా వల్ల దెబ్బతిన్న దేశీయ వాణిజ్యానికి మరింత నష్టం వాటిల్లుతుందని సీఏఐటీ లేఖలో […]

Update: 2021-12-27 08:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: దుస్తులు, పాదరక్షలపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పెంపును వాయిదా వేయాలని, అలాగే ఆదాయ పన్ను రిటర్న్(ఐటీఆర్) గడువు పొడిగించాలని దేశీయ వ్యాపారుల సంఘం సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) దుస్తులు, పాదరక్షలపై నిర్ణయించిన 5 శాతం నుంచి 12 శాతం జీఎస్టీ పెంపు చాలా ఎక్కువని అభిప్రాయపడింది.

దీనివల్ల కరోనా వల్ల దెబ్బతిన్న దేశీయ వాణిజ్యానికి మరింత నష్టం వాటిల్లుతుందని సీఏఐటీ లేఖలో పేర్కొంది. 2022, జనవరి 1 నుంచి తక్కువ పన్ను పరిధిలోని దుస్తులతో పాటు సహజమైన ఫైబర్ ఉత్పత్తులను ప్రభుత్వం జీఎస్టీ రేటును పెంచిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా వీటిపై ఎలాంటి పన్ను లేదని, టెక్స్‌టైల్ పరిశ్రమను మళ్లీ పన్ను పరిధిలోకి తీసుకురావడమే భారంగా మారిందని పరిశ్రమల సంఘం వివరించింది.

ఈ నిర్ణయం అమలైతే వినియోగదారులపై ఆర్థిక భారం తో పాటు చిన్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతింటారు. పన్ను ఎగవేతదారులను ప్రోత్సహించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎగుమతులపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పేర్కొంది. అలాగే, కొత్త ఐటీ వెబ్‌సైట్‌లో పన్ను చెల్లింపుదారులకు ఇంకా పలు సమస్యలు, సవాళ్లు ఉన్నాయని, అందుకోసం ఐటీ పన్ను రిటర్నులను పొడిగించాలని కేంద్రాన్ని కోరింది.

Tags:    

Similar News