తేనెటీగల పరాగసంపర్క సామర్థ్యాన్ని పెంచుతున్న కెఫిన్!

దిశ, ఫీచర్స్: సృష్టిలో ఎంతో విలువైన, అవసరమైన ప్రాణి ‘తేనెటీగ’. ప్రపంచవ్యాప్తంగా 70 శాతం వ్యవసాయం తేనెటీగల మీదే ఆధారపడి జరుగుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. మనం పండిస్తున్న 100 రకాల పంటల్లో 90 రకాలు పుష్పించి, కాపు కాయాలంటే తేనెటీగలే అవసరం. అవి పువ్వుల్లోని మకరందాన్ని ఆస్వాదించే క్రమంలో అలుపెరగక తిరుగుతూ వేలాది పువ్వుల మీద వాలతాయి. అలా పుప్పొడి రేణువుల్ని మోసుకెళ్లడం వల్లే పరాగ, పరపరాగ సంపర్కం జరిగి పంటలు పండుతున్నాయి. అయితే ఆహారం కోసం […]

Update: 2021-07-31 04:29 GMT

దిశ, ఫీచర్స్: సృష్టిలో ఎంతో విలువైన, అవసరమైన ప్రాణి ‘తేనెటీగ’. ప్రపంచవ్యాప్తంగా 70 శాతం వ్యవసాయం తేనెటీగల మీదే ఆధారపడి జరుగుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. మనం పండిస్తున్న 100 రకాల పంటల్లో 90 రకాలు పుష్పించి, కాపు కాయాలంటే తేనెటీగలే అవసరం. అవి పువ్వుల్లోని మకరందాన్ని ఆస్వాదించే క్రమంలో అలుపెరగక తిరుగుతూ వేలాది పువ్వుల మీద వాలతాయి. అలా పుప్పొడి రేణువుల్ని మోసుకెళ్లడం వల్లే పరాగ, పరపరాగ సంపర్కం జరిగి పంటలు పండుతున్నాయి. అయితే ఆహారం కోసం వెళ్లే తేనెటీగలకు కెఫిన్ రుచి చూపిస్తే, నిర్దిష్ట పుష్పాలను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు మరింత సమర్థవంతంగా పరాగసంపర్కం చేయగలవని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

కాగా, తేనెటీగలు కొన్ని పూలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. పండ్లతోటలు సాగుచేసే రైతులు, ముఖ్యంగా స్ట్రాబెర్రీ సాగుదారులు తమ పంటలను పరాగసంపర్కం చెందేందుకు తేనెటీగలు లేదా ప్రత్యేక ‘కమర్షియల్ బంబుల్ బీస్’ను ఉపయోగిస్తారు. వీటినే ‘మేనెజెడ్ పాలినేటర్స్’ అంటారు. కానీ ఈ తేనెటీగలు కొన్నిసార్లు అడవి పువ్వుల ద్వారా పరధ్యానం(డిస్క్రాక్ట్) చెంది, పండ్ల మొక్కల పువ్వులకు ఆకర్షించబడవు. ఇలాంటి సమయాల్లో వాటికి కెఫిన్ అందించడం వల్ల చాలా వేగంగా పండ్ల మొక్కలపై వాలి పరాగ సంపర్కానికి తోడ్పడుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. అంతేకాదు అనుభవం లేని(ఇన్‌ఎక్స్‌పీరియన్సెడ్) తేనెటీగలు.. ఒక నిర్దిష్ట పరిమళాన్ని వెదజల్లుతున్న కొత్త ఆహార వనరులను గుర్తించగలవా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు కూడా పరిశోధకులు ప్రయత్నించారు. ఈ మేరకు ముందుగా వాటికి కెఫిన్ కాక్‌టెయిల్ వాసన(కెఫిన్, చక్కెర, నిర్దిష్ట పూల వాసన) చూపించారు. ఈ ప్రయోగంలో శిక్షణ పొందిన తేనెటీగలు డిస్ట్రాక్టర్ పువ్వులతో పోలిస్తే.. స్ట్రాబెర్రీ వాసన కలిగిన పువ్వులపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు గుర్తించామని పరిశోధకుడు సారా ఆర్నాల్డ్ తెలిపాడు. దీనికి సంబంధించిన ఫలితాలు ఇటీవలే కరెంట్ బయాలజీలో ప్రచురితమయ్యాయి.

జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తుంది..

తాజా అధ్యయనం సంతృప్తికర ఫలితాలనిచ్చింది. ఇక తేనెటీగల ప్రవర్తన, ఫీల్డ్‌లో వాటి పనితీరు మెరుగుపరచడంలో మేము సహాయపడగలం. తేనెటీగలు ఎలా ఆలోచిస్తాయి, ఎలా నేర్చుకుంటాయి అనే అంశాలపై మాకు అవగాహన కల్పించడంతో పాటు వాటి మెదడుపై కెఫిన్ ఎలా పనిచేస్తుందనే విషయంపై అధ్యయనం స్పష్టతనిచ్చింది. మనం కూడా పరీక్షా సమయాల్లో కాఫీ ఎక్కువగా తాగుతుంటాం. దానివల్ల మనకు ఏకాగ్రతతో పాటు, ఫోకస్ పెరుగుతుంది. సంక్లిష్ట సమాచారాన్ని గుర్తుంచుకునేందుకు ఉపయోగపడుతుంది. అలాగే కెఫిన్ కూడా తేనెటీగల ఉత్సాహాన్ని , కార్యాచరణను పెంచుతుందని.. దాని జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తుందని నిరూపితమైంది. అంతేకాదు మనకు, తేనెటీగలకు మధ్య న్యూరోబయాలజీలో సారూప్యతలు ఉన్నాయని ఇది చూపిస్తోంది. మనతో పోలిస్తే తేనెటీగలు గ్రాస్ సీడ్ పరిమాణంలో మెదడును కలిగి ఉంటాయి. వాటి ఆయుర్ధాయం కూడా చాలా తక్కువ. కానీ ఇప్పటికీ సంక్లిష్టమైన పనులు సాధించడంలో అవి నేర్పరితనం ప్రదర్శిస్తాయి. – సారా అర్నాల్డ్, నేచరల్ రిసోర్సెర్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ (గ్రీన్‌విచ్ విశ్వవిద్యాలయం -యూకే)

Tags:    

Similar News