280 ఔట్ లెట్లను మూసేసిన కేఫ్ కాఫీ డే!

దిశ, వెబ్‌డెస్క్: కేఫ్ కాఫీ డే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 280 ఔట్ లెట్లను మూసేసింది. లాభదాయకత, ఖర్చులు పెరుగుదల లాంటి అంశాలను దీనికి కారణంగా కంపెనీ వెల్లడించింది. గతేడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య సుమారు 500 ఔట్ లెట్లను క్లోజ్ చేసిన సమయంలోనూ ఇవే కారణాలుగా కంపెనీ పేర్కొంది. తాజాగా మూసివేతలతో కేఫ్ కాఫీ డే మొత్తం ఔట్ లెట్ల సంఖ్య 1480కి తగ్గిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమ్మకాలు […]

Update: 2020-07-21 02:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేఫ్ కాఫీ డే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 280 ఔట్ లెట్లను మూసేసింది. లాభదాయకత, ఖర్చులు పెరుగుదల లాంటి అంశాలను దీనికి కారణంగా కంపెనీ వెల్లడించింది. గతేడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య సుమారు 500 ఔట్ లెట్లను క్లోజ్ చేసిన సమయంలోనూ ఇవే కారణాలుగా కంపెనీ పేర్కొంది. తాజాగా మూసివేతలతో కేఫ్ కాఫీ డే మొత్తం ఔట్ లెట్ల సంఖ్య 1480కి తగ్గిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమ్మకాలు సగటున 15,445కి క్షీణించినట్టు కంపెనీ వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో అమ్మకాల సగటు 15,739గా తెలిపింది. లాభాలు క్షీణించడం, మూలధన అవసరలు పెరగడంతో ఇప్పటికే ఎగుమతి కార్యకలాపాలను తాత్కాలికంగా ఆపేసింది. ఈ క్రమంలోనే లాభదాయకత, భవిష్యత్తు ఖర్చుల అంశాలను కారణాలుగా 280 ఔట్ లెట్లను మూసేసింది. ఈ మూసివేతలతో మిగిలిన ఔట్ లెట్లను లాభాల్లో కొనసాగించడానికి అవకాశముంటుందని కంపెనీ పేర్కొంది. కాగా, గతేడాది కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య, తదనంతర పరిణామాల తర్వాత బాధ్యతలను నెరవేరుస్తామని కంపెనీ ప్రకటించింది. సిద్ధార్థ మరణం నాటికి కంపెనీకున్న అప్పులు రూ. 4,970 కోట్లుగా ఉండగా, సిద్ధార్థ గ్లోబల్ నాన్-కోర్ అసెట్స్ విక్రయం ద్వారా రుణాలను క్రమంగా తీరుస్తున్నారు. టెక్నాలజీ పార్క్‌ను బ్లాక్ స్టోన్ గ్రూపునకు విక్రయించడం ద్వారా కుదిరిన ఒప్పందం నుంచి 13 సంస్థలకు రూ. 1,644 కోట్లను అప్పులను చెల్లించినట్టు కేఫ్ కాఫీ డే వెల్లడించింది.

Tags:    

Similar News