ఐదు రాష్ట్రాల్లో 4జీ సేవల కనెక్టివిటీకి కేబినెట్ ఆమోదం!

దిశ, వెబ్‌డెస్క్: నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా గ్రామీణ సబ్‌స్క్రైబర్లకు నెల ప్రాతిపదికన ఉచిత డేటా అందించేందుకు కేంద్రం కొత్త పథకం తెచ్చిన సంగతి తెలిసిందే. యూనివర్సల్ సర్వీస్ అబ్లిగేషన్ ఫండ్(యూఎస్ఓఎఫ్) పథకంలో భాగంగా ఐదు రాష్ట్రాల్లో యూఎస్ఓఎఫ్ ద్వారా మొత్తం 7,287 మారుమూల గ్రామాలకు 4జీ మొబైల్ కనెక్టివిటీ అందించే ప్రతిపాదనకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. దీని కోసం రూ. […]

Update: 2021-11-17 07:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా గ్రామీణ సబ్‌స్క్రైబర్లకు నెల ప్రాతిపదికన ఉచిత డేటా అందించేందుకు కేంద్రం కొత్త పథకం తెచ్చిన సంగతి తెలిసిందే. యూనివర్సల్ సర్వీస్ అబ్లిగేషన్ ఫండ్(యూఎస్ఓఎఫ్) పథకంలో భాగంగా ఐదు రాష్ట్రాల్లో యూఎస్ఓఎఫ్ ద్వారా మొత్తం 7,287 మారుమూల గ్రామాలకు 4జీ మొబైల్ కనెక్టివిటీ అందించే ప్రతిపాదనకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. దీని కోసం రూ. 6,466 కోట్లు ఖర్చు చేయనుండగా, ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రజలు ఈ-గవర్నెన్స్ ప్రయోజనాలను ఉపయోగించుకునేందుకు వీలవుతుందని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో ఈ 4జీ ఆధారిత మొబైల్ సేవలు అందుతాయి. ఈ పథకానికి యూఎస్ఓఎఫ్ ద్వారా నిధులు సమకూరనున్నాయి. 4జీ మొబైల్ సేవలు అమలు చేసే ప్రాజెక్ట్ ఒప్పందంపై సంతం చేసిన తర్వాత 18 నెలల్లో పూర్తవుతుంది. 2023 నాటికి ఇది పూర్తయ్యే అవకాశం ఉంది. ఎంపిక చేసిన గ్రామాల్లో 4జీ మొబైల్ సేవలను అందించేందుకు సంబంధించిన పని ప్రస్తుతం యూఎసోఎఫ్ విధానాల ప్రకారం బహిరంగ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా అందించబడుతుందని అనురాగ్ ఠాకూర్ వివరించారు.

Tags:    

Similar News