కర్నూలు న్యాయరాజధాని కాదు కరోనా రాజధాని: బైరెడ్డి

కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్‌కు న్యాయ రాజధాని కాదని, కరోనాకు రాజధానిగా మారిందని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే కరోనా కారణంగా ప్రాణనష్టాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశానని ఆయన చెప్పారు. ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్‌లో కర్నూలు ఇటలీగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కేంద్రం ఇచ్చిన నిధులను ప్రజలకు ఇస్తూ […]

Update: 2020-04-21 06:34 GMT
కర్నూలు న్యాయరాజధాని కాదు కరోనా రాజధాని: బైరెడ్డి
  • whatsapp icon

కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్‌కు న్యాయ రాజధాని కాదని, కరోనాకు రాజధానిగా మారిందని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే కరోనా కారణంగా ప్రాణనష్టాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశానని ఆయన చెప్పారు. ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్‌లో కర్నూలు ఇటలీగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కేంద్రం ఇచ్చిన నిధులను ప్రజలకు ఇస్తూ ఓట్లడగడం సిగ్గు చేటని ఆయన ఎద్దేవా చేశారు.

Tags: byreddy rajasekhar reddy, kurnool, bjp, corona

Tags:    

Similar News