జీహెచ్ఎంసీలో ఒక డివిజన్​కు, 8 వార్డులకు ఉప ఎన్నికలు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మరో 8 మున్సిపాలిటీల్లో 8 వార్డులకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్​ ప్రకటించింది. దీనికి కూడా రేపట్నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. గజ్వేల్​ మున్సిపాలిటీ 12వ వార్డు, నల్గొండ మున్సిపాలిటీలో 26వ వార్డు, జల్​పల్లిలో 28వార్డు, అలంపూర్​లో 5వ వార్డు, బోధన్​లో 18వ వార్డు, పరకాలలో 9వ వార్డు, మెట్​పల్లిలో 8వ వార్డు, బెల్లంపల్లిలో 30వ వార్డు, జీహెచ్​ఎంసీలో 18వ వార్డుకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటికి కూడా […]

Update: 2021-04-15 02:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మరో 8 మున్సిపాలిటీల్లో 8 వార్డులకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్​ ప్రకటించింది. దీనికి కూడా రేపట్నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. గజ్వేల్​ మున్సిపాలిటీ 12వ వార్డు, నల్గొండ మున్సిపాలిటీలో 26వ వార్డు, జల్​పల్లిలో 28వార్డు, అలంపూర్​లో 5వ వార్డు, బోధన్​లో 18వ వార్డు, పరకాలలో 9వ వార్డు, మెట్​పల్లిలో 8వ వార్డు, బెల్లంపల్లిలో 30వ వార్డు, జీహెచ్​ఎంసీలో 18వ వార్డుకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటికి కూడా ఈ నెల 30న పోలింగ్​ ఉంటోంది.

ఇక జీహెచ్​ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్​ కూడా ఉప ఎన్నికను నిర్వహించనున్నారు. 18వ డివిజన్​కు నేటి నుంచి 18 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా 19న పరిశీలన ఉంటుంది. 20న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చి అదే రోజున సాయంత్రం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. ఇక్కడ మాత్రం ప్రచారానికి ఎనిమిది రోజులు అవకాశం ఇచ్చారు. జీహెచ్​ఎంసీ 18వ డివిజన్​లో కూడా ఈ నెల 30న పోలింగ్​ జరుగనుండగా… మే 3న కౌంటింగ్​ ఉండనుంది.

ఏడు పురపాలికల్లో మొత్తం 11,26,221 మంది ఓటర్లు ఉండగా… 5,53,862 మంది పురుషులు, 5,72,121 మంది మహిళలు, 236 మంది ఇతరులున్నారు. మొత్తం 248 వార్డులను విభజించారు. 1532 పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల కోసం 203 రిటర్నింగ్​ అధికారులు, 203 మంది అసిస్టెంట్​ రిరట్నిగ్​ అధికారులు, 6070 పోలింగ్​ సిబ్బంది, 1555 మంది కౌంటింగ్​ సిబ్బంది, 97 మంది జోనల్​ అధికారులు, 33 ఫ్లయింగ్​ స్క్వాడ్​ బృందాలు, 22 సర్వెలైన్స్​ బృందాలు, 8 మంది జనరల్ అబ్జర్వర్లు, 778 మంది మైక్రో అబ్జర్వర్లు, 10 వ్యయ పరిశీలన బృందాలు, 20 మంది అదనపు వ్యయ పరిశీలన సిబ్బందిని నియమించారు. ఈ ఎన్నికలకు 2479 బ్యాలెట్​ బాక్స్​లను వినియోగిస్తున్నారు.

కాగా పోటీ చేసే అభ్యర్థులకు ధరావత్తును ఖరారు చేసింది. మున్సిపాలిటీల్లో జనరల్​ అభ్యర్థులు రూ. 2500, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ. 1250 చొప్పున, కార్పొరేషన్లలో జనరల్​ అభ్యర్థులు రూ. 5 వేలు, ఎస్సీ, ఎస్టీ,బీసీ అభ్యర్థులు రూ. 2,500 చొప్పున నామినేషన్​ ధరావత్తు చెల్లించాల్సి ఉంటోంది.
అదే విధంగా జీహెచ్​ఎంసీలో అభ్యర్థులు రూ. 5 లక్షలు, మిగిలిన కార్పొరేషన్లలో రూ. 1.50 లక్షలు, మున్సిపాలిటీలో రూ. 1 లక్ష వరకు ప్రచార ఖర్చును ఖరారు చేస్తూ ఎస్​ఈసీ నోటిఫికేషన్​లో పేర్కొంది.

Tags:    

Similar News