నష్టాల నుంచి గట్టెక్కిన జొమాటో.. లాభం ఎంతంటే..

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తాజాగా తన ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది.

Update: 2024-02-08 12:10 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తాజాగా తన ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది.2023-24 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.138 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ రూ. 347 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది. కొంత కాలంగా భారీ నష్టాలను చవి చూసిన జొమాటో ఈ సారి లాభాలను ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా మొత్తం ఆదాయం గత ఏడాది రూ.1,948 కోట్ల నుంచి 69 శాతం పెరిగి రూ.3,288 కోట్లకు పెరిగింది. డెలివరీ ఖర్చులు 63 శాతం పెరిగి రూ.1,068 కోట్లకు, మార్కెటింగ్ ఖర్చులు 7 శాతం పెరిగి రూ.374 కోట్లకు చేరుకున్నాయి.

నూతన సంవత్సర వేడుకల సమయంలో కంపెనీ పెద్ద ఎత్తున డెలివరీలు చేసింది. గత కొన్నేళ్లలో భారీగా పడిపోయిన జొమాటో షేర్ ధర ప్రస్తుతం పుంజుకుంటుంది. జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ మాట్లాడుతూ, తమ కంపెనీ అంచనాలను మించి వృద్ధిని కొనసాగిస్తుంది. రానున్న రోజుల్లో స్థూల పునరుద్ధరణను చూస్తే లాభాలు మరింత పెరిగే అవకాశం ఉంది. కస్టమర్లు, రెస్టారెంట్లు, ప్రతి వాటాదారుల ప్రయోజనాలను రక్షించుకుంటూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.


Similar News