Zomato: ప్లాట్‌ఫామ్ ఫీజు రూపంలో రూ.83 కోట్లు వసూలు చేసిన జొమాటో

జొమాటో సర్దుబాటు చేసిన రాబడికి కీలకమైన మూడు అంశాలలో ప్లాట్‌ఫామ్ ఫీజు కూడా ఒకటి అని కంపెనీ నివేదికలో పేర్కొంది.

Update: 2024-08-04 14:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో గతేడాది ఆగష్టులో వినియోగదారుల నుంచి ఆర్డర్‌లపై ప్లాట్‌ఫామ్ ఫీజును వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఈ రుసుము ద్వారా కంపెనీ రూ. 83 కోట్లు వసూలు చేసినట్టు తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అంతేకాకుండా జొమాటో సర్దుబాటు చేసిన రాబడికి కీలకమైన మూడు అంశాలలో ప్లాట్‌ఫామ్ ఫీజు కూడా ఒకటి అని కంపెనీ నివేదికలో పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆదాయం 27 శాతం పెరిగి రూ. 7,792 కోట్లకు చేరుకుంది. 'రెస్టారెంట్ కమీషన్ టేక్-రేట్ల పెరుగుదల, ప్రకటనల మానిటైజేషన్ మెరుగుదల, ప్లాట్‌ఫారమ్ రుసుమును ప్రవేశపెట్టడం వల్ల సర్దుబాటు చేసిన ఆదాయం పెరుగుతోందని ' జొమాటో వివరించింది. జొమాట్ 2023, ఆగష్టులో ఒక్కో ఆర్డర్‌కు రూ. 2 చొప్పున ప్లాట్‌ఫామ్ ఫీజును అమలు చేసింది. ప్రస్తుతం కీలక మార్కెట్లలో ఇది రూ. 6 వరకు పెరిగింది. జొమాటోతో పాటు మరో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ సైతం తన ఆర్డర్‌లపై ప్లాట్‌ఫామ్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించింది. ఈ నిర్ణయం ద్వారా ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్‌ల లాభదాయకతను పెంచుతుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. 

Tags:    

Similar News