ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్‌ల నియామకానికి జీ ఎంటర్‌టైన్‌మెంట్ బోర్డు ఆమోదం

జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్(ZEEL) బోర్డులో ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్‌ల నియామకానికి షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారు.

Update: 2024-03-16 11:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్(ZEEL) బోర్డులో ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్‌ల నియామకానికి షేర్‌హోల్డర్లు ఆమోదం తెలిపారు. వెంకట రమణ మూర్తి పినిశెట్టి, ఉత్తమ్ ప్రకాష్ అగర్వాల్, శిశిర్ బాబుభాయ్ దేశాయ్ నియామకానికి సంబంధించిన ప్రత్యేక తీర్మానాలను పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ద్వారా వాటాదారులు ఆమోదించారు. మొత్తం చెల్లుబాటయ్యే ఓట్ల సంఖ్యలో 75 శాతానికి పైగా అనుకూలంగా వచ్చాయి. ఈ ఫలితం కంపెనీ బోర్డుపై వాటాదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ZEEL ఒక ప్రకటనలో తెలిపింది.

ఇంతకుముందు ఫిబ్రవరి 5, 2024న, జీ ఎంటర్‌టైన్‌మెంట్ డిసెంబర్ 17, 2023 నుంచి డిసెంబర్ 16, 2026 వరకు మూడు సంవత్సరాల కాలానికి ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్ల నియామకం కోసం వాటాదారుల ఆమోదానికి పోస్టల్ బ్యాలెట్ నోటీసును పంపింది. శుక్రవారం కంపెనీ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ నితిన్ మిట్టల్‌కు రాజీనామా చేశారు. గత రెండేళ్లుగా ఈ పదవిలో ఉన్న మిట్టల్‌ రాజీనామాను కంపెనీ బోర్డు ఆమోదించింది.


Similar News