కేవలం 4 గంటల్లో రూ. 482 కోట్లు సంపాదించిన రాకేష్ జున్‌ఝున్‌వాలా భార్య
స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్ అంటే గుర్తుకు వచ్చేది, దివగంత పెట్టుబడిదారుడు రాకేష్ జున్‌ఝున్‌వాలా.
దిశ, వెబ్‌డెస్క్: స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్ అంటే గుర్తుకు వచ్చేది, దివగంత పెట్టుబడిదారుడు రాకేష్ జున్‌ఝున్‌వాలా. ఈ మధ్య కాలంలో అతను మరణించిన నేపథ్యంలో అతని పేరు మీద స్టాక్‌మార్కెట్లో ఉన్న పెట్టుబడులు(షేర్లు) అన్ని కూడా అతని భార్య రేఖా ఝున్‌జున్‌వాలాకు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. రాకేష్ జున్‌ఝున్‌వాలా మరణంతో వివిధ కంపెనీలలో పెట్టుబడులు అన్ని కూడా ఆమె చూసుకుంటున్నారు. అయితే రాకేష్ జున్‌ఝున్‌వాలా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెట్టారు. అతని మరణం తరువాత షేర్లు అన్ని కూడా రేఖా ఝున్‌ఝున్‌వాలాకు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఆమె 10,07,53,935 షేర్లను కలిగి ఉన్నారు.
సోమవారం, స్టార్ హెల్త్ షేరు ధర మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.556.95ను తాకింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభమైన నాలుగు గంటల్లోనే ఇంట్రాడేలో ఒక్కో ఈక్విటీ షేర్ రూ.47.90 పెరిగింది. స్టార్ హెల్త్ షేర్ ధర పెరగడం వల్ల ఆమె దాదాపు రూ. 482 కోట్ల భారీ ఆదాయాన్ని ఆర్జించింది. అలాగే, ఆమె టాటాకు చెందిన కంపెనీలో పెట్టుబడి ద్వారా కేవలం రెండు వారాల్లోనే రూ.1000 కోట్లు సంపాదించినట్లు సమాచారం. భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో రేఖా ఝున్‌జున్‌వాలా కూడా ఒకరు. ఆమె నికర ఆస్తి విలువ రూ. 47,650 కోట్లుగా ఉంటుందని అంచనా.