UIDAI: ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..

ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే తేదీ శనివారంతో ముగిసిన నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది

Update: 2024-09-14 08:05 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే తేదీ శనివారంతో ముగిసిన నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత అప్‌డేట్‌ను గుడువును మరోసారి పెంచింది. డిసెంబర్ 14, 2024 వరకు పొడిగిస్తున్నట్లు తాజాగా సోషల్ మీడియా ఎక్స్‌లో తెలియజేసింది. తమ ఆధార్‌ డేటాను ఇప్పటి వరకు అప్‌డేట్ చేయని వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉచిత సేవ కేవలం myAadhaar పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

సంస్థ నిబంధనల ప్రకారం, ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేసి పేరు, పుట్టినతేదీ, అడ్రస్, మొబైల్ నెంబర్ అప్‌డేట్ వంటి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఒకవేళ ఉచిత గడువు ముగిసిన తరువాత ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రంగా ఉంది. దీని ద్వారా ప్రభుత్వం నుంచి పలు రకాల సేవలను సైతం పొందవచ్చు. అలాగే ప్రైవేటు రంగంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.


Similar News