Post Office Schemes: 14లక్షలు మీ సొంతం.. ఆ పథకంలో మీరు ఉన్నారా.?

రూ.15 లక్షల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఒకేసారి రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. వడ్డీ రూపంలో రూ. 4,28,964

Update: 2022-10-08 16:47 GMT
Post Office Schemes: 14లక్షలు మీ సొంతం.. ఆ పథకంలో మీరు ఉన్నారా.?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : చాలా మందికి బ్యాంకులపై ఉన్నంత అవగాహన పోస్టాఫీస్‌లపై ఉండదు. ఫోస్టాఫీసుల్లో అకౌంట్ తీయడం, ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం లాంటి విషయాలు కొంత మందికే తెలిసే అవకాశం ఉంటుంది. అందుకే పోస్టాఫీసుల్లో చాలా తక్కువగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడే మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. అది ఏంటో తెలుసా.?

పోస్టాఫీస్‌లో చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఎన్నో రకాల పథకాలను అందిస్తున్నారు. వీటిల్లో డబ్బులు పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. కచ్చితమైన రాబడి పొందొచ్చు. అందుకే పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో చాలా మంది డబ్బుల ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. యువకులకు, సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకమైన స్కీమ్స్ ఉన్నాయి. ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. మీరు రూ.1000తో కూడా ఈ స్కీమ్‌లో ఖాతా ఓపెన్ చేయవచ్చు.

గరిష్టంగా రూ.15 లక్షల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఒకేసారి రూ.10 లక్షలు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. ఐదేళ్లలో మీకు రూ.14 లక్షలకు పైగా వస్తాయి. వడ్డీ రూపంలో రూ. 4,28,964 వరకు పొందుతారు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లుగా ఉంది. అయితే మీరు అవసరం అనుకుంటే మెచ్యూరిటీ కాలాన్ని మరో 3 ఏళ్లు పొడిగించుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చ‌ద‌వండి : 

Post Office super hit Scheme: కేవలం రూ.5 వేల పెట్టుబడితో సొంతంగా వ్యాపారం..

పండగ టైంలో షాకింగ్ న్యూస్: పెరిగిన సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు 

Tags:    

Similar News