రూ.7.73 లక్షల ప్రారంభ ధరతో టయోటా కొత్త SUV విడుదల
దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టయోటా నుంచి కొత్త మోడల్ కారు ఏప్రిల్ 3న ఇండియాలో విడుదల అయింది. దీని పేరు ‘అర్బన్ క్రూయిజర్ Taisor SUV’.
దిశ, బిజినెస్ బ్యూరో: దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టయోటా నుంచి కొత్త మోడల్ కారు ఏప్రిల్ 3న ఇండియాలో విడుదల అయింది. దీని పేరు ‘అర్బన్ క్రూయిజర్ Taisor SUV’. ఈ కారు డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అధునాతన ఫీచర్లతో వచ్చింది. దీని ప్రారంభ ధర రూ.7.73 లక్షలు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.1.0L టర్బో, 1.2L పెట్రోల్, E-CNG ఎంపికలతో అర్బన్ క్రూయిజర్ టైజర్ అసాధారణమైన పనితీరును, సాటిలేని ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. పెట్రోల్ ఇంజన్ 89 bhp పవర్, 113 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ SUVలోపల 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కోసం వైర్లెస్ కనెక్టివిటీ, 360-డిగ్రీ కెమెరా,ఆరు-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ LED హెడ్‌ల్యాంప్‌లు, భద్రత కోసం ఎయిర్‌బ్యాగులు మొదలగునవి ఉంటాయి. కారు లోపల విశాలమైన క్యాబిన్ కావాలనుకునే భారతీయ కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా దీనిని తయారు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో SUV విభాగంలో తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో Taisor SUV మోడల్ రెనాల్ట్ కిగర్, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సోనెట్ వంటి వాటికి గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.