ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రాలేదా.. అయితే ఈ నెంబర్‌కు కాల్ చేయండి

దేశవ్యాప్తంగా సన్న, చిన్న కారు రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ను తీసుకొచ్చింది..Latest Telugu News

Update: 2022-09-13 03:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సన్న, చిన్న కారు రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ను తీసుకొచ్చింది. ప్రతి ఏడాది రైతుల పంట ఖర్చులకు సాయంగా రూ. 6,000 లను వారి అకౌంట్లలో జమ చేస్తుంది. వీటిని మూడు విడతలుగా రైతులకు అందిస్తుంది. ఇప్పటికే 11వ విడత డబ్బులు అర్హత గల రైతుల అకౌంట్లో జమ చేశారు. ఇప్పుడు 12 వ విడత కోసం వారు ఎదురు చూస్తున్నారు.

రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సహాయం పొందడానికి e-KYC చాలా ముఖ్యం. అలాగే అప్లికేషన్ ప్రాసెస్‌లో సరైన పత్రాలు, ఎలాంటి తప్పులు లేకుండా సబ్మిట్ చేయడం వలన ప్రభుత్వం నుంచి పంట సహాయం పొందవచ్చు. అలా కాకుండా ఏవైనా తప్పులు ఉన్నట్లయితే, అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 10,11 వ విడతలలో చాలా మంది e-KYC పూర్తి చేయకపోవడం, అప్లికేషన్‌ను తప్పుగా అప్లై చేయడం వంటి కారణాల వలన వారు ప్రధానమంత్రి కిసాన్ సాయాన్ని పొందలేకపోయారు.


కనీసం 12వ విడత కోసం e-KYC పూర్తి చేసి, కరెక్ట్ ఫార్మాట్‌లో దరఖాస్తు చేయడం వలన కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని పొందవచ్చు. అయితే దరఖాస్తు దారులకు వచ్చేటటువంటి సందేహలు, అప్లికేషన్ స్టేటస్‌ను తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్‌ను తీసుకొచ్చింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి గురించి పూర్తి సమాచారం పొందడానికి ఈ టోల్ ఫ్రీ నంబర్‌ ఉపయోగపడుతుంది.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి టోల్ ఫ్రీ నెంబర్ '155261'. లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో లేదో, e-KYC ప్రక్రియ, ఖాతాలో నిధులు జమ గురించి, మొదలగు పూర్తి సమాచారం ఈ నంబర్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అగ్రికల్చర్ ఇండియా ఈ నెంబర్‌ గురించి ట్విట్టర్‌లో ప్రకటించింది.

Also Read : సికింద్రాబాద్ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన


Similar News