మళ్లీ మార్కెట్లోకి ఒకప్పటి క్రేజీ బైక్ ‘Yamaha RD350’..?
మార్కెట్లో పాత వాహనాలకు బాగా క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఒకప్పుడు బైక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్న ‘యమహా RD350’ అంటే ఇప్పటికి కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.
దిశ, వెబ్‌డెస్క్: మార్కెట్లో పాత వాహనాలకు బాగా క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఒకప్పుడు బైక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్న ‘యమహా RD350’ అంటే ఇప్పటికి కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. అందుకే ఈ బైక్‌ను తిరిగి మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. యమహా RD350 దాని క్లాసిక్ డిజైన్, శక్తివంతమైన పనితీరు పరంగా అత్యంత ప్రజాదరణ పొందింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ బైక్ అమ్మకాలను నిలిపివేసిన కంపెనీ, తాజాగా తిరిగి లాంచ్ చేయనుందని తెలుస్తోంది. గట్టి పోటీ ఉన్నటువంటి మార్కెట్లో ఈ బైక్‌ను లాంచ్ చేయడం ద్వారా తమ అమ్మకాలను మరో మైలురాయికి తీసుకుపోవచ్చని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే RD350 బైక్ RZ350గా తిరిగి రావచ్చని నివేదికలు సూచించాయి.
కొత్తగా తీసుకురానున్న Yamaha RD350 బైక్‌లో లేటేస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా ఫోర్-స్ట్రోక్ ఇంజిన్, బ్లూటూత్ కనెక్షన్, డ్యూయల్-ఛానల్ ABS, DRLతో LED హెడ్‌లైట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ డ్యాష్‌బోర్డ్, అసిస్ట్‌తో ట్రాక్షన్ కంట్రోల్, స్లిప్పర్ క్లచ్ మొదలగు ఫీచర్స్ ఉండవచ్చని నిపుణల అంచనా. గతంలో Yamaha RD350 గరిష్టంగా 39 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేసే 347cc ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో అందించబడింది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఈ మోడల్‌లో పలు మార్పులు రానున్నట్లు తెలుస్తోంది.
Also Read..
టికెట్ బుకింగ్, అమ్మకాలను నిలిపేయాలని గో ఫస్ట్‌కు డీజీసీఏ ఆదేశాలు!