ఇన్నోవాకి బాప్..మారుతీ సుజుకీ ఇన్‌విక్టో !
మార్కెట్లోకి ఎన్ని రకాల కార్లు వచ్చినా 7 సీటర్ కార్లు తమదైన ముద్ర వేసుకున్నాయి.
దిశ,వెబ్‌డెస్క్: మార్కెట్లోకి ఎన్ని రకాల కార్లు వచ్చినా 7 సీటర్ కార్లు తమదైన ముద్ర వేసుకున్నాయి. అన్ని కంపెనీలు ఆ తరహా కార్లు విడుదల చేస్తూ ఉన్నాయి. అయితే వీటిలో లైట్ వెహికిల్స్ కొన్ని అయితే మరికొన్ని సేఫ్టీ ఫీచర్లతో తయారు చేస్తున్న కార్లు మరికొన్ని. మరి ఈ విభాగంలో ఇప్పటివరకూ టయోటా ఇన్నోవా రాజ్యమేలుతోంది. ఇటీవల ఇన్నోవాలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ కార్లు వచ్చాయి. ఇప్పుడు ఈ తరహాలోనే ఇన్నోవాకి బెస్ట్ కాంపిటీటర్ వెహికల్‌గా మారుతీ సుజుకీ ఇన్‌విక్టోను విడుదల చేస్తోంది. ఇది ఇన్నోవాకి బెస్ట్ కాంపిటీషన్ ఇవ్వగలదని కంపెనీ చెబుతోంది. ఈ కారు బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.
బుకింగ్స్ ప్రారంభం
మారుతి సుజుకి మూడు వరుసల ఎస్‌యూవీ కం మల్టీ పర్పస్ వెహికల్ (ఎంవీపీ) కారు ఇన్‌విక్టో ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు మారుతి సుజుకి వెబ్‌సైట్ ద్వారా లేదా సమీప నెక్సా డీలర్‌ల వద్ద గానీ రూ.25 వేలు చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. టయోటా ఇన్నోవా హైక్రాస్ టెక్నాలజీ ఆధారంగా రూపుదిద్దుకున్న ఇన్‌విక్టో లాంచింగ్‌పై సోషల్ మీడియా వేదికలపై క్యాంపెయిన్ ప్రారంభించింది. జూలై 5న ఈ కారు మార్కెట్లోకి రానుంది.
హైబ్రిడ్ టెక్నాలజీ
మారుతి సుజుకి ఇన్‌విక్టో 2.0-లీటర్ల పెట్రోల్ ఇంజిన్ విత్ స్ట్రాంగ్ హైబ్రీడ్ టెక్నాలజీతో లభించనుంది. ఈ ఇంజిన్ ఈ-డ్రైవ్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో వస్తోంది. ఇది గరిష్టంగా 180 హెచ్‌పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. మారుతి సుజుకి ఇన్‌విక్టో ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ వంటి అడాస్ సిస్టమ్‌తో కూడిన సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.19 లక్షలు వరకూ ఉండే అవకాశం ఉంది.
బెస్ట్ ఫీచర్స్ ఇవే
10.1-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవ్ సీట్ విత్ మెమరీ ఫంక్షన్, సెంట్రల్ కన్సోల్ వద్ద కంట్రోల్ ప్యానెల్, 9-స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్ విత్ సబ్‌ఊఫర్ ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. మధ్య వరుసలో ఒట్టోమాన్ కెప్టెన్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టైల్‌గేట్ కూడా ఉంటాయి.