Tax Payers: ట్యాక్స్ పేయర్స్ కు గుడ్ న్యూస్.. బిలేటెడ్‌ ఐటీఆర్‌ ఫైలింగ్ గడువు పొడగింపు..!

సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) అసెస్మెంట్ ఇయర్(2024-25)కు సంబంధించి బిలేటెడ్‌(Belated)/ రివైజ్డ్‌(Revised) ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్(ITR) దాఖల గడువును మరోసారి పొడిగించింది.

Update: 2024-12-31 11:43 GMT

దిశ,వెబ్‌డెస్క్: సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) అసెస్మెంట్ ఇయర్(2024-25)కు సంబంధించి బిలేటెడ్‌(Belated)/ రివైజ్డ్‌(Revised) ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్(ITR) దాఖల గడువును మరోసారి పొడిగించింది. నిజానికి గడవు నేటితో ముగియనుండగా తాజాగా దాన్ని మరో 15 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంటే ఇండియాలో నివసించే వారికి జనవరి 15 వరకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) ఎక్స్(X)లో ప్రకటించింది. ట్యాక్స్ పేయర్స్(Tax Payers) ప్రతి ఏడాది తమ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ను జులై 31 లోగా ఫైల్(File) చేయాల్సి ఉంటుంది. కాగా ఏదైనా కారణంతో జులైలో ఐటీఆర్‌ దాఖలు చేయని వారు జరిమానా చెల్లించి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవచ్చు. బిలేటెడ్‌ ఐటీఆర్‌ దాఖలు చేసేవారి వార్షికాదాయం రూ. 5 లక్షల లోపు ఉంటే రూ. 1,000, అంతకన్నా ఎక్కువుంటే రూ. 5,000 వరకు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే గడువు ముగియకముందే ఐటీఆర్‌ ఫైల్ చేసిన వారు అవసరమైతే రివైజ్డ్‌ ఐటీఆర్‌ దాఖలు చేయడానికి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.


Tags:    

Similar News