Tata Motors: ఈవీ సహా అన్ని ప్యాసింజర్ కార్ల ధరలు పెంచిన టాటా మోటార్స్
ఈవీలు, సాంప్రదాయ ఇంధన ప్యాసింజర్ కార్ల ధరలను 3 శాతం మేర పెంచుతూ నిర్ణయించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా వాహన తయారీ కంపెనీలు కొత్త ఆర్థిక సంవత్సరం కస్టమర్లకు ధరల షాక్ ఇవ్వనున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకి ధరలు పెంచుతున్నట్టు ప్రకటించగా, మంగళవారం టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు అన్ని ప్యాసింజర్ కార్ల ధరలు పెంచాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. ఇదివరకే కంపెనీ తన కమర్షియల్ వాహనాల ధరలు 2 శాతం పెంచింది. తాజా ప్రకటనలో ఈవీలు, సాంప్రదాయ ఇంధన ప్యాసింజర్ కార్ల ధరలను 3 శాతం మేర పెంచుతూ నిర్ణయించింది. సవరించిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయని, వాహన మోడల్, వేరియంట్‌ని బట్టు వ్యత్యాసం ఉంటుందని టాటా మోటార్స్ అధికారిక ప్రకటనలో తెలిపింది. వాహనాల తయారీలో ఇన్‌పుట్ ఖర్చులు పెరిగిపోవడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అధిక ముడిసరుకు, లాజిస్టిక్స్ ఖర్చుల కారణంగా కంపెనీ కొంత భారాన్ని వినియొగదారులకు బదిలీ చేసింది. సాధ్యమైనంత వరకు కస్టమర్లపై భారం పడకుండా ఖర్చులను నియంత్రించే చర్యలు చేపడుతున్నామని కంపెనీ పేర్కొంది.