Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. 984 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..!
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ రోజు(బుధవారం) మళ్లీ భారీ నష్టాల్లో ముగిశాయి.
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ రోజు(బుధవారం) మళ్లీ భారీ నష్టాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ నుంచి నెగటివ్ సిగ్నల్స్ రావడం, రెండో త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీలకు నష్టాలు రావడం, ఫారిన్ ఇన్వెస్టర్ల నిధులు వెళ్లిపోతుండటం తదితర కారణాలుతో మన బెంచ్ మార్క్ సూచీలు కుదేలయ్యాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్ఛేంజ్ లో మదుపర్ల సంపద రూ. 8 లక్షల కోట్లు తగ్గి రూ. 438 లక్షల కోట్ల నుంచి రూ. 430 లక్షల కోట్లకు చేరుకుంది. ముఖ్యంగా ఈ రోజు బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్(Sensex) ఉదయం 78,495.53 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలై మార్కెట్ ముగిసే వరకు నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 77,533.30 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 984 పాయింట్ల నష్టంతో 77,690.95 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 324 పాయింట్లు క్షీణించి 23,559.05 వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.30 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.38 దగ్గర ముగిసింది.
లాభాలో ముగిసిన షేర్లు : ఎన్టీపీసీ, బ్రిటానియా ఇండస్ట్రీస్, హిందూస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్, టాటా మోటార్స్
నష్టపోయిన షేర్లు : హీరో మోటోకార్ప్, హిందాల్కో, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్