Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ చివరి సెషన్..!
దేశీయ ఈక్విటీ స్టాక్ మార్కెట్లు(Stock Market) ఈ ఇయర్ చివరి షెషన్ ను నష్టాలతో ముగించాయి.
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ స్టాక్ మార్కెట్లు(Stock Market) ఈ ఇయర్ చివరి షెషన్ ను నష్టాలతో ముగించాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగిటివ్ సిగ్నల్స్ అందడంతో ఈ రోజు సూచీలు నష్టాలతో ప్రారంభం కాగా.. చివరి వరకు నష్టాల్లోనే కదలాడాయి. ముఖ్యంగా ఈ రోజు బ్యాంకింగ్(Banking), ఐటీ(IT) స్టాక్ షేర్లు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. నిన్నటి సెషన్ తో పోలిస్తే సెన్సెక్స్(Sensex) 77,982.57 పాయింట్ల వద్ద నష్టాలతో స్టార్ట్ అయ్యింది. ఇంట్రాడేలో 78,305 వద్ద కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 109.12 పాయింట్ల నష్టంతో 78,139.01 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 0.10 పాయింట్లు క్షీణించి 23,644.80 వద్ద స్థిరపడింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. అమెరికన్ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 85.65 వద్ద ముగిసింది.
లాభాల్లో ముగిసిన షేర్లు: అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ
నష్టాల్లో ముగిసిన షేర్లు: ఐసీఐసీఐ బ్యాంక్, జొమాటో, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్